
నటి హన్సిక పెళ్లికి సిద్ధమైనట్లు, డిసెంబర్‌లోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్తరాది బ్యూటీ ధనుష్ జంటగా వప్పిళ్లై త్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా విజయ్, ఆర్య, శింబు వంటి స్టార్ హీరోలతో జత కట్టి ప్రముఖ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. అలాగే తెలుగులోనూ ప్రముఖ హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకున్న హన్సిక నటిగా అర్ధ శతకం దాటేసింది. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం జరిపి, పెళ్లికి కూడా సిద్ధమైపోయింది. అయితే భేదాభిప్రాయాల కారణంగా శింబుతో పెళ్లి పీటలు దాకా వెళ్లలేదు.
ఆ తర్వాత ప్రేమ, పెళ్లికి దరంగా ఉంటూ నటనపై దృష్టి సారించింది. ఇటీవల పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ఇప్పుడు పెళ్లికి తొందర ఏముంది? నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని బదులిచ్చిన హన్సిక సడన్‌గా పెళ్లికి రెడీ అవుతుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఈమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు, డిసెంబర్‌లో వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. హన్సిక పెళ్లి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ప్రాచీన ప్యాలెస్‌లో జరగనుందని, దీంతో ఆ ప్యాలెస్‌ను అలంకరించే పనిలో హన్సిక కుటుంబం ఉందని, ఎక్కువ సమయం లేకపోవడంతో పెళ్లి కార్యక్రమాలు హడావుడిగా నిర్వహిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. అయితే హన్సిక పెళ్లి గురించి ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎ లాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment