
చాలా కాలం నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరో సందీప్ కిషన్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తరువాత ఈ హీరో కెరీర్‌లో మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చూడక చాలా ఏళ్లైంది. అయినా వరుసగా సినిమాలు చేస్తూ.. సక్సెస్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.
సందీప్ కిషన్ ప్రస్తుతం నిను వీడని నీడను నేను, తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ చిత్రాలను చేస్తున్నాడు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా తెనాలి రామకృష్ణ చిత్రం నుంచి మే 7న ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.