ఈసారి పెద్దవాళ్ల కోసం! | Hansika Motwani celebrates 25th birthday with friends | Sakshi

ఈసారి పెద్దవాళ్ల కోసం!

Aug 10 2016 11:24 PM | Updated on Sep 4 2017 8:43 AM

ఈసారి పెద్దవాళ్ల కోసం!

ఈసారి పెద్దవాళ్ల కోసం!

అందమైన రూపం మాత్రమే కాదు... అంతకు మించి అందమైన మనసు హన్సిక సొంతం. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు

 అందమైన రూపం మాత్రమే కాదు... అంతకు మించి అందమైన మనసు హన్సిక సొంతం. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు నాడు అనాథ బాలలను దత్తత తీసుకుంటూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటి వరకూ ఆమె 31 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. తానే తల్లీ తండ్రీ అయ్యి ఆ బాలల ఆలనా పాలనా చూసుకుంటున్నారు.
 
 ఈ నెల 9న హన్సిక పుట్టినరోజు. అయితే ఈసారి ఎవ్వరినీ దత్తత తీసుకోలేదు. ఎందుకంటే... వృద్ధాశ్రమం కట్టాలనుకుంటున్నారు. పిల్లల ఆదరణ కోల్పోయిన వృద్ధులకు అండగా, ఆసరాగా నిలవాలని హన్సిక నిర్ణయించుకున్నారు. ‘‘ఈసారి హన్సిక పిల్లలను దత్తత తీసుకోలేదు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటోంది.
 
  31 మంది చిన్నారుల బాధ్యతలను చూసుకోవడంతో పాటు ఆశ్రమంపై దృష్టి పెడుతున్నాం’’ అని హన్సిక తల్లి మోనా తెలిపారు. పండగలు, పుట్టినరోజు వంటి ముఖ్యమైన సందర్భాలను చిన్నారులతో జరుపుకుంటారు హన్సిక. 25వ పుట్టినరోజును కూడా వారితోనే జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వారితో గడిపిన తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement