బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన హన్సిక మొత్వానీ దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. అమాయకపు చూపులతో సన్యాసిగా నటించిన హన్సిక నటనకు, అందానికి ప్రేక్షకులు దాసోహమయ్యారు. మా కళ్లతో చూడు మామా అంటూ తెలుగబ్బాయిలు ఆమె ఫ్యాన్స్ లిస్టులో చేరిపోయారు. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హన్సిక ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది.
తాజాగా ఆమె గతంలో ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఒకప్పుడు ఎలా ఉండేదంటే డిజైనర్లు మాకు డ్రెస్సులు ఇచ్చేవాళ్లే కాదు. ఓహ్, మీరు దక్షిణాది హీరోయినా? మీకు మేము దుస్తులివ్వం అని ముఖం మీదే చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వారంతట వారే స్వయంగా వచ్చి మరీ మీకు ఏదో ఈవెంట్ ఉన్నట్లుంది.. ట్రైలర్ లాంచ్ లాంటివి.. మరి అలాంటప్పుడు మేము డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవచ్చు కదా? అని బతిమాలుతున్నారు.
అప్పటి మాటలకు, ఇప్పటి మాటలకు చాలా తేడా ఉంది కదా! గతంలో వాళ్లు అలా చులకనగా మాట్లాడినప్పుడు నేనేమీ వాళ్లపై పగ పెంచుకోలేదు. దానికి బదులుగా నేనింకా కష్టపడాలి. వాళ్లను నా పనితో తిరిగి రప్పించేలా చేయాలని కసిగా ఉండేదాన్ని. ఎప్పుడైతే ఛీ కొట్టినవాళ్లే తిరిగి వచ్చారో అప్పుడు నాకే ఆశ్చర్యం వేసేది. ఏంటి? మీరిప్పుడు నన్ను రెడీ చేయాలనుకుంటున్నారా? అది కూడా మీ కాస్ట్యూమ్‌తో అని ఒక సెకన్ ఆలోచించి ఓకే చెప్పేదాన్ని అని చెప్పుకొచ్చింది. కాగా హన్సిక ప్రస్తుతం మ్యాన్ అనే సినిమా చేస్తోంది.
చదవండి: 20 ఏళ్లుగా బుల్లితెరకు దూరం.. అదే నేను చేసిన తప్పు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment