హీరోయిన్స్ అందాన్ని పొగిడేవారితో పాటు ఆ అందానికి ఏదో ఇంజక్షన్సో లేదా సర్జరీనో కారణమై ఉంటుందని విమర్శించేవాళ్లు కూడా ఉంటారు. హన్సిక కూడా ఇలాంటి ఇంజక్షన్స్ ఏదో తీసుకునే ఉంటుందని ఆమధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిందీ బ్యూటీ. హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న లవ్ షాదీ డ్రామా రెండో ఎపిసోడ్‌లో ఆ రూమర్లను కొట్టిపారేసింది.
'సెలబ్రిటీగా ఉండటం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చాలామంది నా గురించి చెత్తవాగుడు వాగారు. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందనుకుంటా. చాలామంది నేను త్వరగా పెరిగేందుకు ఇంజక్షన్స్ తీసుకున్నానని రాశారు. 8 ఏళ్లకే నేను నటినయ్యాను. అందుకని మా అమ్మ నాకు హార్మోనల్ ఇంజక్షన్స్ ఇచ్చి నన్ను త్వరగా పెద్దది చేసిందని మాట్లాడుకున్నారు. అది నిజమని ఎలా అనుకుంటున్నారు?' అని హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది. హన్సిక తల్లి మధ్యలో అందుకుంటూ.. 'అదే కనక నిజమయ్యుంటే నేను టాటా, బిర్లాల కంటే ధనవంతురాలినయ్యేదాన్ని. మీరు కూడా అలా త్వరగా ఎదిగే చిట్కా చెప్పమని నా దగ్గర క్యూ కట్టేవారు. అయినా అలా రాయడానికి కాస్తైనా కామన్‌సెన్స్ వాడరా?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
చదవండి: కోట శ్రీనివాసరావుకు గొంతు అరువిచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment