రీల్‌ లైఫ్‌లో, రియల్‌ లైఫ్‌లో హన్సిక సింగిల్‌! | Hansika Motwani One Shot Film 105 Minutes Shooting Begins | Sakshi
Sakshi News home page

Hansika Motwani: హన్సిక సింగిల్‌!

Published Thu, Jul 22 2021 7:51 AM | Last Updated on Thu, Jul 22 2021 7:51 AM

Hansika Motwani One Shot Film 105 Minutes Shooting Begins - Sakshi

Hansika In 105 Minutes: అవును.. హన్సిక సింగిల్‌గా ఉన్నారు. రియల్‌ లైఫ్‌లో ఆమె సింగిల్‌. ‘105 మినిట్స్‌’ సినిమాలోనూ సింగిల్‌గానే కనిపించనున్నారు. ఒకే ఒక పాత్రతో ఈ సినిమా సాగుతుంది. ఈ షూటింగ్‌లో జాయిన్‌ అయిన హన్సిక ‘‘కొత్త చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాను. ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.. రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్‌ సెల్యులాయిడ్‌పై బొమ్మక్‌ శివ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఒకే ఒక్క క్యారెక్టర్‌ చుట్టూ ఉత్కంఠగా సాగే కథా కథనాలతో ఈ సినిమా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక ప్రత్యేకంగా ఎడిటింగ్‌ చేయించకుండా, షూటింగ్‌ స్పాట్‌లోనే ఎడిటర్‌ శ్యామ్‌ పర్యవేక్షిస్తున్నారు. ‘ఒక షాట్, ఒక పాత్ర, రీల్‌ టైమ్‌–రియల్‌ టైమ్‌’ హైలైట్స్‌’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిషోర్‌ బొయిదాపు, సంగీతం: సామ్‌ సి. యస్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement