![హన్సిక.. ఉదయనిధి.. ఓ సెల్ఫీ!](/styles/webp/s3/article_images/2017/09/3/81441448721_625x300.jpg.webp?itok=WXgCI2bE)
హన్సిక.. ఉదయనిధి.. ఓ సెల్ఫీ!
బబ్లీ బ్యూటీ హన్సిక.. సెల్ఫీలతో బిజీబిజీగా గడిపేస్తోంది. ఒకపక్క షూటింగులో పాల్గొంటూనే కాస్త విరామం దొరికినప్పుడల్లా ఓ సెల్ఫీ తీసేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఒకవైపు ట్విట్టర్, మరోవైపు ఇన్స్టాగ్రామ్ రెండింటిలోనూ హన్సిక తన సెల్ఫీలు పోస్ట్ చేస్తోంది.
నేరుగా సెట్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నానంటూ హీరో ఉదయనిధి స్టాలిన్తో కలిసి తాను దిగిన ఫొటోలను ట్వీట్ చేసింది. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ తమ తమ ఫోన్లతో ఫొటోలు తీసుకుంటుండగా.. అవతలి నుంచి మూడో వ్యక్తి కూడా ఒకరు వీళ్లిద్దరినీ ఫొటో తీశారు. ఇప్పుడా సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోనే హన్సిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
Reporting live from sets !!! Behind the scenes #candid @Udhaystalin