బాలా దర్శకత్వంలో శింబు? | Shimbu Directed by Bala? | Sakshi
Sakshi News home page

బాలా దర్శకత్వంలో శింబు?

Published Mon, Dec 5 2016 2:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

బాలా దర్శకత్వంలో శింబు?

బాలా దర్శకత్వంలో శింబు?

దర్శకుడు బాలా, నటుడు శింబు కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుందా?అన్న ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వస్తోంది. శింబు నటించిన అచ్చంయన్భదు మడమైయడా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని అధిగమించి మంచి వసూళ్లను సాధించింది. తాజాగా ఆధిక్ రవించద్రన్ దర్శకత్వంలో నటిస్తున్న అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంపై మరింత అంచనాలు పెరిగారుు. మిల్కీబ్యూటీ తమన్నా, ,శ్రీయ నారుుకలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తరువాత శింబు సంచలన విజయాన్ని సాధించిన ప్రేమమ్ చిత్ర దర్శకుడు ఆల్ఫోన్‌‌స పుత్రన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు బాలా పేరు తెరపైకి వచ్చింది. తారైతప్పటై్ట చిత్రం తరువాత జాతీయ ఉత్తమ దర్శకుడు బాలా కుట్రపరంపరై అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెకిక్కంచడానికి సన్నాహాలు చేశారు.అరుుతే అదే కథతో దర్శకుడు భారతీరాజా చిత్రం ప్రారంభించడంతో అది వివాదంలో పడింది.చివరికి ఆ ఇద్దరు దర్శకులు ఆ కథతో చిత్రం చేయడాన్ని విరమించుకున్నారు. తాజాగా దర్శకుడు బాలా నటుడు శింబు కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. బాలా ప్రస్తుతం ఈ చిత్ర కథను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారట. వచ్చే ఏడాది బాలా, శింబుల సంచలన కాంబినేషన్‌లో చిత్రం ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement