పాటల్లేవ్‌ మిత్రమా! | Kettavan Kettil Kittum Pillaiyaam release the film in September | Sakshi
Sakshi News home page

పాటల్లేవ్‌ మిత్రమా!

Published Mon, Jul 31 2017 2:32 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

పాటల్లేవ్‌ మిత్రమా!

పాటల్లేవ్‌ మిత్రమా!

తమిళసినిమా: పాటల్లేవు మిత్రమా, విశ్రాంతి ఉండదు. అందుకే ముందుగానే వాష్‌రూమ్‌కు వెళ్లడం, కూల్‌డ్రిం క్స్, పాప్‌కార్న్‌ వంటి తినుబండారాలను కొనుక్కోండి. సమయం కూడా లేదు అభిమానులారా, సెప్టెంబర్‌లోనే వచ్చేస్తున్నా. ఇదంతా ఏమిటనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. నటుడు శింబు న టించిన అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రం భారీ అంచనాల మధ్య ఆ మధ్య తెరపైకి వచ్చి పూర్తిగా నిరాశ పరచిన విషయం తెలిసిందే.

దీంతో ఆ చిత్రానికి రెండవ భాగం వస్తుందన్న యూనిట్‌ వర్గాలు చెప్పినా, అది జరిగేపనేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి నటుడు శింబు తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు మధ్యలో ఆగిపోయిన కెట్టవన్‌ చిత్ర బూజు దులపడానికి ఆయన సన్నద్ధం అవుతున్నారని, కాదు బిల్లా–3 చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనికి స్పందించిన శింబు ఆ ప్రచారంలో నిజం లేదని, తన తదుపరి చిత్రం గురించి తానే త్వరలో ప్రకటిస్తానని ట్విట్టర్‌లో పేర్కొని వదంతులకు పుల్‌స్టాప్‌ పెటా ్టరు.

ఇటీవల శింబు తన తాజా చిత్రం గురించి ప్రకటించారు. కెట్టవన్‌ కెట్టిటిల్‌ కిట్టిడుమ్‌ రాజయోగం చిత్రంలో నటిం చనున్నట్లు, దీనికి తన తండ్రి టి.రాజేందర్‌ నిర్మాత అని తెలిపారు. ఇందులో పాటలు ఉండవని, చిత్ర మధ్యలో విశ్రాంతి కూడా ఉండదని, అం దుకే ప్రేక్షకులు ముందుగానే వాష్‌రూమ్‌ కార్యక్రమాలను ముగించుకుని థియేటర్లలో చిత్రాన్ని చూడడానికి సిద్ధం కావాలన్నారు. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు శింబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement