ముద్దు శింబుకేనట | Varalaxmi Sarath kumar Kiss For only Simbhu | Sakshi
Sakshi News home page

ముద్దు శింబుకేనట

Published Tue, Dec 18 2018 11:26 AM | Last Updated on Tue, Dec 18 2018 11:26 AM

Varalaxmi Sarath kumar Kiss For only Simbhu - Sakshi

సినిమా: శింబుకే ముద్దిస్తానంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. కోలీవుడ్‌లో డేరింగ్‌ నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ. ఎలాంటి పాత్రనైనా సవాల్‌గా తీసుకుని నటిస్తూ నటిగా తన ప్రత్యేకతను చాటు కుంటున్నారు. ప్రస్తుతం వరలక్ష్మీశరత్‌కుమార్‌ చేతిలో అరడజను చిత్రాలకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్రలు, మరి కొన్ని లేడీ ఓరియంటెడ్‌ పాత్రలు, ఇంకొన్ని విలనిజాన్ని  ప్రదర్శించే  పాత్రలతో కూడిన చిత్రాలు ఉండటం విశేషం. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విలనిజాన్ని ప్రదర్శించిన సర్కార్‌ చిత్రం ఈ మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ధనుష్‌తో నటించిన మారి–2 చిత్రం ఈ నెల 21వ తేదీన తెరపైకి రానుంది.

ఈ అమ్మడు ఇటీవల ఒక అవార్డుల వేడుక కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ ఒక వ్యాఖ్యాత ఆమెతో ఒక ముద్దు ఇవ్వాల్సివస్తే, ఒకరిని చంపాల్సివస్తే, ఒకరిని పెళ్లి చేసుకోవాల్సివస్తే ఈ మూడు విషయాల్లో మీ చాయిస్‌ ఎవరు? అని ప్రశ్నించగా ఈ సంచలన నటి ఏమాత్రం తడుముకోకుండా ముద్దు శింబుకు ఇస్తానని చెప్పింది. ఇక చంపాల్సివస్తే అది విశాల్‌నేనని అంది. పెళ్లి మాత్రం వేరెకరిని చేసుకుంటానని బదులిచ్చింది. ఈ అమ్మడు తొలిసారిగా శింబుతో కలిసి పోడా పోడీ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక నటుడు విశాల్‌తో కలిపి ఈ బ్యూటీ గురించి చాలా వదంతులు ప్రచారంలో ఉన్న విషయం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా సండైకోళి–2 చిత్రంలో విశాల్‌కు పత్రినాయకిగా నటించి అదరగొట్టిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement