
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‍కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం నికోలాయ్ సచ్‍దేవ్‍ను ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇటీవల కోలీవుడ్ ప్రముఖలను కలిసి వెడ్డింగ్ కార్డ్స్ సైతం పంపిణీ చేస్తోంది. రజినీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది.
వరలక్ష్మి, నికోలాయ్ సచ్‌దేవ్ వివాహం థాయ్‌లాండ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. జూలై 2న ఈ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే థాయ్‍లాండ్‍లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్‍ను చెన్నైలో నిర్వహించనున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‍దేవ్‍తో వరలక్ష్మి శరత్ కుమార్ దాదాపు పదేళ్లుగా పరిచయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment