మేలో అచ్చంయంబదు మడమయడా | shimbhu movie release in may | Sakshi
Sakshi News home page

మేలో అచ్చంయంబదు మడమయడా

Mar 23 2016 2:56 AM | Updated on Sep 3 2017 8:20 PM

మేలో అచ్చంయంబదు మడమయడా

మేలో అచ్చంయంబదు మడమయడా

అచ్చంయంబదు మడమయడా చిత్రం విడుదల తేదీ ఖారారైందని సమాచారం.

అచ్చంయంబదు మడమయడా చిత్రం విడుదల తేదీ ఖారారైందని సమాచారం. శింబు నటించిన చిత్రం అచ్చంయంబదు మడమయడా. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళం చిత్రం ప్రేమమ్ ఫేమ్ మంజిమామోహన్ కథానాయకిగా పరిచయం అవుతున్నారు. విన్నైతాండి వరువాయా వంటి విజయవంతమైన చిత్రం తరువాత శింబు, గౌతమ్ మీనన్‌ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం అచ్చంయంబదు మడమయడా. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తళ్లీ పోగాదే అనే ఇందులోని సింగిల్ ట్రాక్ పాట జనవరి నెలలో యూట్యూబ్‌లో విడుదలై పెద్ద విశేష స్పందన పొందింది.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న అచ్చంయంబదు మడమయడా చిత్రం ఆడియో త్వరలో విడుదల సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది.చిత్రాన్ని మే 17న విడుదలకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అయితే దీనికి ముందే శింబు నటించిన ఆయన సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన ఇదునమ్మ ఆళు చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నయనతార, ఆండ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా శింబు సోదరుడు కురలరసన్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారన్నది తెలిసిన విషయమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement