
అదితీరావ్ హైదరి
మరోసారి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు అదితీరావ్ హైదరి. మణిరత్నం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే గోల్డెన్.. గోల్డెన్ ఏంటి? డైమండ్ అని కూడా అనొచ్చేమో. ‘‘మణిరత్నంగారి దర్శకత్వంలో గతేడాది ‘చెలియా’ చేశాను. ఆ తర్వాత సంజయ్‌దత్ సినిమా ‘భూమి’లో కీలక పాత్ర చేశాను. గతేడాది చాలా పాజిటివ్‌గా గడిచింది.
ఇప్పుడు మణి సార్ సినిమాలో మళ్లీ నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతానికి నా క్యారెక్టర్ డిటైల్స్ సీక్రెట్’’ అని పేర్కొన్నారు అదితీరావ్ హైదరి. ప్రజెంట్ మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌సేతుపతి, శింబు, జ్యోతిక, ఐశ్యర్య రాజేష్, ఫాజల్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకే అదితీని తీసుకున్నారట మణి. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment