adithi rao
-
రాజస్థాన్‌లో పెళ్లి పార్టీ.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ అన్‌సీన్ ఫోటోలు
-
పెళ్లి తర్వాత మరింత గ్లామర్‌గా కనిపిస్తోన్న సిద్ధార్థ్ సతీమణి.. ఫోటోలు
-
Cannes 2024: పింకీ గౌన్‌లో అదితిరావు ప్రెటీ లుక్స్ (ఫోటోలు)
-
మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ప్రపంచంలో నెపోటిజమ్ లేనిది ఎక్కడ? : బాలీవుడ్ హీరోయిన్
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక రంగంలోకి అడుగుపెట్టి, పైకి రావడం అనేది చిన్న విషయం కాదు. సొంత నిర్ణయాలు తీసుకోవాలి, తప్పొప్పుల మీద అవగాహన ఉండాలి. అదే వారసులకు అయితే గైడ్ చేయడానికి చాలామంది ఉంటారు. సినిమా పరిశ్రమలో వారసత్వం గురించి పలు సందర్భాల్లో బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు మాట్లాడారు. వారసులకు అవకాశాలు సులువుగా వస్తాయని, వారికి ఇచ్చే మర్యాదలు వేరేగా ఉంటాయని బాహాటంగానే కొందరు అన్నారు. ‘నెపోటిజమ్’ (బంధుప్రీతి) గురించి కథానాయిక అదితీరావ్ హైదరీ మాట్లాడుతూ –‘‘నా దృష్టిలో నెపోటిజటమ్ అనేది చెడ్డ పదం. అసలు ప్రపంచంలో నెపోటిజమ్ లేనిది ఎక్కడ? అయితే దీన్ని నేను విమర్శించడంలేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని నాకు ఎవరి గురించీ ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ దక్కింది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి అవకాశాలు సులువుగా వస్తాయి. కానీ ఈ విషయంలో నాకెలాంటి కోపం లేదు. నా ఎదుగుదల నా శక్తిని తెలియజేస్తుంది. నేను కలలు కనడానికి ఇష్టపడతాను. వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతేకానీ ఇతరుల గురించి చెడుగా ఆలోచించను. నా ప్రతి నిర్ణయం నాకు శక్తినివ్వడంతో పాటు, నిర్భయంగా ముందుకు సాగేలా చేస్తోంది’’ అన్నారు. తెలుగులో ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’, ‘వి’ వంటి చిత్రాల్లో నటించిన అదితీ రావ్ ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘మహాసముద్రం’లో కథానాయికగా నటిస్తున్నారు. -
అలాంటి వారిపై జాలి పడతా..!
సాక్షి, తమిళ సినిమా : అలాంటి వారిని చూసి తాను జాలి పడతానని చెప్పింది నటి అదితిరావు. కోలీవుడ్‌లో కాట్రువెలియిడై, సెక్క సివందవానం వంటి చిత్రాల్లో నటించిన జాణ ఈ అమ్మడు. టాలీవుడ్‌లోనూ తన ఉనికిని చాటుకుంటున్న అదితిరావ్ ఆశించిన స్థాయిలో అవకాశాలను కానీ, క్రేజ్‌ను కానీ ఇంకా సంపాదించుకోలేదు. అయితే విమర్శకులకు మాత్రం ఎక్కవ పనిచెబుతూ ఉంటోంది. ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉండే అదితిరావ్ అందాలను ఆరబోసిన ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వారి విమర్శలకు గురవుతుంటుంది. అలాంటిది ఈ సారి తనే విమర్శకులపై విరుచుకుపడింది. దీని గురించి ఈ భామ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో తనను విమర్శించిన వారి గురించి పాపం అని జాలి పడతానంది. అలావిమర్శలు చేసేవారి నుంచి దూరంగా తాము పారిపోలేమంది. ఎలాంటి విమర్శనలనైనా నిజాయితీగా స్వాగతించాలని అంది. ఇతరులపై విమర్శలు చేసేవారు ఏదో సమస్యతో బాధపడుతున్నారన్నది తన భావన అని చెప్పింది. విమర్శకులకు ఏదో విషయంపై కోపం ఉండి ఉంటుందని, లేకపోతే వారి జీవితం మీద వారికే విరక్తి కలిగి ఉండవచ్చునని పేర్కొంది. ఆ కోపాన్ని సామాజిక మాధ్యమాల్లో విమర్శల ద్వారా తీర్చుకుంటున్నారని అంది. అలాంటి వారికి మనం ఒక్కటే చేయగలం అంది. అది వారిని చూసి జాలి పడడమేనని చెప్పింది. అంతేకాకుండా వారు బాగుండాలని తాను భగవంతుడిని ప్రారి్థంచిన సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పింది. ఈ రోజు మీకు మధురమైన రోజుగా గడవాలని ప్రారి్థస్తుంటానని చెప్పింది. వారు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటానంది. ఇక పోతే నటిగా తాను బిజీగానే ఉన్నానని, తమిళం, తెలుగు భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయని నటి అదితిరావ్ పేర్కొంది. -
నలుగురిలో నవాబ్ ఎవరు?
నవాబ్.. అనుకున్నంత ఈజీ కాదు అవ్వడం. ఆరాటపడేవారు, పోరాడేవారు, లాక్కోవాలనుకునేవారు, కష్టపడి దక్కించుకునేవారు... అందరూ లిస్ట్‌లో ఉంటారు. ప్రస్తుతం ఆ లిస్ట్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర ఉంది. సినిమాలో నవాబ్ ఎవరన్నది తెరపై చూడాల్సిందే అంటున్నారాయన. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీరావ్ హైదరి, ఐశ్వర్య రాజేష్, ప్రకాశ్‌రాజ్ ముఖ్యతారలుగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ్లో ‘చెక్కవంద వానమ్’ (ఎర్రని ఆకాశం తెలుగులో)అని, తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. శుక్రవారం టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మరి.. ఎవరు నవాబ్? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాలో ఓ ఇద్దరు హీరోలు అన్నదమ్ముల పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో న్యూ లుక్‌లో కనిపించడానికి హీరో శింబు ఆల్రెడీ వర్కౌట్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మదరాస్ టాకీస్ పతాకం, లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
రత్నం లాంటి చాన్స్
మరోసారి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు అదితీరావ్ హైదరి. మణిరత్నం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే గోల్డెన్.. గోల్డెన్ ఏంటి? డైమండ్ అని కూడా అనొచ్చేమో. ‘‘మణిరత్నంగారి దర్శకత్వంలో గతేడాది ‘చెలియా’ చేశాను. ఆ తర్వాత సంజయ్‌దత్ సినిమా ‘భూమి’లో కీలక పాత్ర చేశాను. గతేడాది చాలా పాజిటివ్‌గా గడిచింది. ఇప్పుడు మణి సార్ సినిమాలో మళ్లీ నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతానికి నా క్యారెక్టర్ డిటైల్స్ సీక్రెట్’’ అని పేర్కొన్నారు అదితీరావ్ హైదరి. ప్రజెంట్ మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌సేతుపతి, శింబు, జ్యోతిక, ఐశ్యర్య రాజేష్, ఫాజల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకే అదితీని తీసుకున్నారట మణి. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. -
విద్య ద్వారానే అభివృద్ధి: సినీనటి ఆదితిరావు
మహబూబ్‌నగర్: విద్య ద్వారానే సమాజం, వ్యక్తి అభివృద్ధి సాధ్యపడుతుందని బాలీవుడ్ నటి ఆదితిరావు హైదరి అన్నారు. ఆమె బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ప్రొక్టర్ అండ్ గాంబుల్ (పీఅండ్‌జీ) సంస్థ నిర్మించిన ‘పీఅండ్‌జీ శిక్ష’ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బాలికలతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆదితీరావు మాట్లాడుతూ పీతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పీఅండ్‌జీ సంస్థ నిర్వాహకులు ‘పీఅండ్‌జీ శిక్ష’ పేరుతో 12 పాఠశాల భవనాలు నిర్మించి, 3 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న 330 పాఠశాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలిపారు. 'పీఅండ్‌జీ శిక్షణ'కు మరిన్ని నిధులు సమకూర్చేందుకు పీఅండ్‌జీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు. అలా కొనుగోలు చేయగా వచ్చిన లాభాల్లో నుంచి కొద్దిమొత్తాన్ని పీఅండ్‌జీ నిర్వాహకులు తిరిగి పాఠశాల భవనాల నిర్మాణం, సౌకర్యాల కల్పనకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలిక విద్యను మరింత ప్రోత్సహించ డానికి పీఅండ్‌జీ శిక్షా ముందడుగు వేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, పీఅండ్‌జీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. (కొత్తూరు)