
సాక్షి, తమిళ సినిమా : అలాంటి వారిని చూసి తాను జాలి పడతానని చెప్పింది నటి అదితిరావు. కోలీవుడ్‌లో కాట్రువెలియిడై, సెక్క సివందవానం వంటి చిత్రాల్లో నటించిన జాణ ఈ అమ్మడు. టాలీవుడ్‌లోనూ తన ఉనికిని చాటుకుంటున్న అదితిరావ్ ఆశించిన స్థాయిలో అవకాశాలను కానీ, క్రేజ్‌ను కానీ ఇంకా సంపాదించుకోలేదు. అయితే విమర్శకులకు మాత్రం ఎక్కవ పనిచెబుతూ ఉంటోంది. ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉండే అదితిరావ్ అందాలను ఆరబోసిన ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వారి విమర్శలకు గురవుతుంటుంది. అలాంటిది ఈ సారి తనే విమర్శకులపై విరుచుకుపడింది. దీని గురించి ఈ భామ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో తనను విమర్శించిన వారి గురించి పాపం అని జాలి పడతానంది. అలావిమర్శలు చేసేవారి నుంచి దూరంగా తాము పారిపోలేమంది. ఎలాంటి విమర్శనలనైనా నిజాయితీగా స్వాగతించాలని అంది.
ఇతరులపై విమర్శలు చేసేవారు ఏదో సమస్యతో బాధపడుతున్నారన్నది తన భావన అని చెప్పింది. విమర్శకులకు ఏదో విషయంపై కోపం ఉండి ఉంటుందని, లేకపోతే వారి జీవితం మీద వారికే విరక్తి కలిగి ఉండవచ్చునని పేర్కొంది. ఆ కోపాన్ని సామాజిక మాధ్యమాల్లో విమర్శల ద్వారా తీర్చుకుంటున్నారని అంది. అలాంటి వారికి మనం ఒక్కటే చేయగలం అంది. అది వారిని చూసి జాలి పడడమేనని చెప్పింది. అంతేకాకుండా వారు బాగుండాలని తాను భగవంతుడిని ప్రారి్థంచిన సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పింది. ఈ రోజు మీకు మధురమైన రోజుగా గడవాలని ప్రారి్థస్తుంటానని చెప్పింది. వారు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటానంది. ఇక పోతే నటిగా తాను బిజీగానే ఉన్నానని, తమిళం, తెలుగు భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయని నటి అదితిరావ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment