కలైంజర్‌నగర్ చిత్రయూనిట్
ఈ తరం దర్శకులు సినిమాను ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. ప్రయోగాలతో గిన్నిస్ రికార్డులను సాధిస్తున్నారు. ఆ కోవలో తెరకెక్కిన చిత్రం కలైంజర్‌నగర్. దీనికి సుగన్‌కుమార్ కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈయన ఇంతకుముందు పోదాం అనే చిత్రాన్ని 23 గంటల 23 నిమిషాల్లో తెరకెక్కించారు. తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ 23 గంటల 7 నిమిషాలకు ముందే తాజా సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడం విశేషం.
ఎస్‌ఆర్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై శివరాజ్ నిర్మించిన ఈ చిత్రానికి గాయత్రి సుగన్ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇందులో నటుడు ప్రాజన్, నటి ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటించగా, నటుడు లివింగ్ స్టన్, పుగళ్ ముఖ్యపాత్రలు పోషించారు. నరేశ్ సంగీతాన్ని, ఇళయరాజా ఛాయాగ్రహణంను అందించారు. ఈ చిత్ర మీడియా సమావేశాన్ని శనివారం సాయంత్రం చైన్నెలో ని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు.
కార్యక్రమంలో బుల్లితెర నటీనటుల సంఘం అధ్యక్షుడు దళపతి పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ముందుగా చిత్ర దర్శకుడు సుగన్‌కుమార్ మాట్లాడుతూ పెద్ద పెద్ద దర్శకులు భారీ చిత్రాలను తెరకెక్కిస్తానని, తాను ఈ చిన్న చిత్రాన్ని భారీగా రూపొందించినట్లు చెప్పారు. ఇది పూర్తిగా స్టేజీ నృత్య కళాకారుల ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని తెలిపారు. ఇందులో మూడు పాటలు, రెండు ఫైట్స్ ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్‌ను 23 గంటల్లో పూర్తి చేసిన ఘనత తనది మాత్రమే కాదని దీనికి పనిచేసిన అందరికీ చెందుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment