విజయ్‌ చిత్రానికి శింబు సంగీత బాణీలు | hero simbu music to hero thalaiva vijay movie | Sakshi
Sakshi News home page

విజయ్‌ చిత్రానికి శింబు సంగీత బాణీలు

Published Mon, Mar 27 2017 2:40 AM | Last Updated on Mon, Aug 20 2018 3:40 PM

విజయ్‌ చిత్రానికి శింబు సంగీత బాణీలు - Sakshi

విజయ్‌ చిత్రానికి శింబు సంగీత బాణీలు

సంచలన నటుడు శింబు నటుడు అజిత్‌కు వీరాభిమాని అన్నది తెలిసిందే. ఒక స్టార్‌ హీరోగా ఉండి అజిత్‌ చిత్రాన్ని తొలిరోజు తొలి ఆటనే చూసేంత అభిమానం ఆయనది. ఈ మధ్య శింబు చిత్రం వాలు విడుదల సమయంలో సమస్యలను ఎదుర్కొనగా నటుడు విజయ్‌ కల్పించుకుని ఆ సమస్యను పరిష్కరించి వాలు చిత్ర విడుదలకు కారణం అయ్యారు. అప్పటి నుంచి విజయ్, శింబుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇక అజిత్‌పై అభిమానం తగ్గినట్టేనా అన్న ప్రశ్నకు విజయ్‌ తనకు అన్నయ్య లాంటివాడని అజిత్‌కి తానెప్పుడూ అభిమానినేనని బదులిచ్చారు శింబు.

అలాంటి శింబు త్వరలో విజయ్‌తో చేతులు కలపడానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 61వ చిత్రాన్ని చేస్తున్నారు. సమంత, కాజల్, నిత్యామీనన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దళపతి అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. విజయ్‌ తదుపరి ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి నటుడు శింబు సంగీతబాణీలు కట్టబోతున్నట్లు తాజాగా కోలీవుడ్‌ వర్గాల బోగట్టా. శింబులో ఒక్క నటుడే కాకుండా గీతరచయిత, గాయకుడు ఉన్నారు.

తాజాగా సంతానం కథానాయకుడిగా నటిస్తున్న ఓడి ఓడి ఉళక్కునుమ్‌ చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం విడుదల కాకుండానే విజయ్‌ 62వ చిత్రానికి బాణీలు కట్టడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఇందులో వాస్తవమెంత అన్నది మరికొన్ని రోజులు ఆగితేగానీ తెలియదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement