
కల్యాణీ ప్రియదర్శన్
టాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్. తెలుగులో సాయిధరమ్‌తేజ్ (చిత్రలహరి), శర్వానంద్ సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఇటీవల తమిళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘వాన్’ సినిమాలో కథానాయికగా నటించే చాన్స్ కొట్టేశారు. తాజాగా శింబు హీరోగా నటించనున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘మానాడు’ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తారు. ‘‘అమేజింగ్ స్క్రిప్ట్. ‘మానాడు’ షూటింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు కల్యాణి. మరి.. ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఇందులో కల్యాణి ఏదైనా పొలిటికల్ పార్టీకి చెందిన అమ్మాయి పాత్రలో కనిపిస్తారా? లేక వేరే పాత్రలో అలసరిస్తారా? వెయిట్ అండ్ సీ!
Comments
Please login to add a commentAdd a comment