
సాక్షి, చెన్నై : నటుడు శింబుపై మద్రాసు హైకోర్టు సీరియస్ అయ్యింది. నిర్మాత నుండి తీసుకున్న అడ్వాన్స్ వడ్డితో సహా చెల్లించాలని ఆదేశించింది. డబ్బు చెల్లించకపోతే ఇల్లు, ఇతర ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. ప్యాషన్ మూవీ మేకర్స్ దగ్గర అరాసన్ చిత్రంలో హీరోగా నటించేందుకుగానూ 2013 జూన్ 17న రూ. 50 లక్షలు అడ్వాన్స్‌గా శింబు తీసుకున్నారు. అయితే అనుకున్న ప్రకారం శింబూ ఆ ప్రాజెక్టులో నటించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. శింబు వడ్డీతో సహాకలిపి రూ.85 లక్షలు ప్యాషన్ మూవీ మేకర్స్‌కు చెల్లించాలని కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment