
Simbu Cries At His Maanadu Movie Event: కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తమిళ హీరో శింబు కన్నీరు పెట్టుకున్నారు. వెంకటేశ్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మానాడు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ.. మూవీ విశేషాలను పంచుకుంటూనే ఒక్కసారిగా కన్నీటిపర్యంతరం అయ్యాడు.
చదవండి: పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం
వెంకట్ ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే కొన్ని కారణాల వల్ల కుదరలేదన్నాడు. ‘మానాడు’ సినిమాలో వినోదానికి కొదవ ఉండదని, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. ఇక ఈ సినిమాలో ఎజ్‌జే సూర్య నటన అద్భుతంగా ఉంటుందని శింబు పేర్కొన్నాడు. అంతేగాక సినిమా విడుదల తర్వాత తన మరో స్థాయికి వెళ్తుందన్నాడు. ఇప్పటి వరకు సరదాగా మాట్లాడిన శింబు ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనని కొందరూ టార్గెట్ చేశారని, కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా
శింబు ఏడవడం చూసిన పక్కనే ఉన్న మిగతా సినిమా క్రూడ్ ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి దాని నుంచి తేరుకున్న శింబు ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని, తన సంగతిని మాత్రం మీరు (అభిమానులు) చూసుకోవాలని కోరారు. శింబు కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదికపై ఉన్న భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్‌జే సూర్య, నిర్మాత కె.రాజన్ తదితరులు ఆయనను ఓదార్చారు.