అశ్విన్‌తో ప్రేమలో పడిందా?
మొండోడు.. దేనికీ భయపడడు.. ఈ రెండు లక్షణాలకు తోడు ప్రేమ ఉన్నోడు.. ఇటువంటి వ్యక్తితో ప్రేమలో పడితే బాగుంటుందని కొందరు అమ్మాయిలు కోరుకుంటారు. తమన్నాకు అలాంటోడు దొరికాడు. కానీ, తన ఈడూ జోడూ ఉన్న అబ్బాయి కాదు, 60 ఏళ్ల అశ్విన్ తాత. ఆ అశ్విన్ తాతయ్య ఎవరో కాదు, హీరో శింబు. ఇదంతా తమిళ సినిమా ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’ సంగతి. ‘‘అరవై ఏళ్ల తాతయ్యతో ఇరవై ఐదేళ్ల అమ్మాయి ప్రేమలో పడిందా? లేదా? సినిమా చూసి తెలుసుకోండి.
ఈ జోడీ మాత్రం చరిత్ర సృష్టించడం ఖాయం’’ అంటున్నారు చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్. ఈ సినిమాలో శింబు మూడు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో అశ్విన్ తాత పాత్ర ఒకటి. ఈ తాతగారితో తమన్నా చేసే సందడి భలేగా ఉంటుందట. శ్రీయ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.