నాకున్న ఇద్దరు, ముగ్గురి ఫ్యాన్లకే చెబుతున్నా : హీరో | Simbu Fires On Netizens Over Vantha Rajavathaan Varuven | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 22 2019 6:17 PM | Last Updated on Tue, Jan 22 2019 7:26 PM

Simbu Fires On Netizens Over Vantha Rajavathaan Varuven - Sakshi

తమిళ నాట నిత్యం వివాదాల్లో ఉండే స్టార్‌ హీరో శింబు.. ప్రస్తుతం ఓ సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ అత్తారింటికి దారేది మూవీ రీమేక్‌గా రాబోతోన్న 'వంద రాజవతాన్ వరువేన్' ఫిబ్రవరి ఒకటో తేదీన రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ఓ సందేశాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. 

థియేటర్ల వద్ద హంగామా చేయవద్దు, టిక్కెట్లను బ్లాక్‌లో కొనకండి, థియేటర్లలోనే చూడండి.. భారీ​ ప్లెక్స్‌లు, కటౌట్‌లు, పాలాభిషేకాలు చేయకండి.. డబ్బును వృథా చేయకండి. ఆ డబ్బుతో అమ్మానాన్నలు బాగా చూసుకోండి వారి తరువాతే ఎవరైనా అంటూ వీడియోను పోస్ట్‌ చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం శింబును ఓ ఆటాడేసుకున్నారు. ఇదొక పబ్లిసిటీ స్టంట్‌ అని, నీకు అంతా సీన్‌ లేదు, నువ్వు అంత పెద్ద హీరోవి కాదని, నీకు ఉండేదే ఇద్దరు ముగ్గురు అభిమానులు అంటూ నానా రకాలుగా కామెంట్లు చేశారు. 

అసలే కోలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్‌గా ముద్రపడిన శింబు.. వీటికి తన స్టైల్లో సమాధానం చెప్పాడు. వెంటనే మరో వీడియోను షేర్‌ చేస్తూ..తాను ఇంతకు ముందు షేర్‌చేసిన వీడియోలో చెప్పిన వాటికి కొంతమంది నెగెటివ్‌గా కామెంట్‌ చేశారని, నాకు ఉన్నది ఇద్దరు ముగ్గురు ఫ్యాన్సేనని వారికే ఇది చెబుతున్నా అని.. ఇంతవరకు చేయనంత హంగామా చేయండని, భారీ​ ప్లెక్సీలు, పెద్ద పెద్ద కటౌట్లు కట్టండని, పాల ప్యాకెట్లతో కాదు పాల క్యాన్లతో పాలాభిషేకం చేయండంటూ తన స్టైల్లో నెటిజన్లకు కౌంటర్‌ వేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement