నాణ్యమైన విద్యను అందించాలి
Published Thu, Sep 8 2016 12:09 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
గట్టు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎంవీఎఫ్ స్టేట్ క్వాలిటీ కోఆర్డినేటర్ ధనంజయ్య అన్నారు. బుధవారం ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లో పని చేస్తున్న విద్యావలంటీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తరగతి గదుల్లో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన చేయాలన్నారు. విద్యార్థులతో కలిసిపోయి వారిని ఆటపాటల ద్వారా విద్యాబోధన సాగిస్తూ, చదువు పట్ల అమిత ఆసక్తి కలిగించాలన్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంవీఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్‌రావు, ఆర్గనైజర్ హన్మిరెడ్డి, మొబిలైజర్లు మోహన్, రాజు, అమరేష్, నరేష్, భవాని, సువర్ణ, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యావలంటీర్లు పాల్గొన్నారు.
Advertisement