
పాపం... సీత కష్టాలు!
టీవీక్షణం: ప్రేమించే భర్త దొరికితే ఆడ పిల్లకి అంతకన్నా అదృష్టం మరొ కటి ఉండదంటారు. మీనాక్షికి ప్రేమించే భర్తే దొరికాడు. కానీ ఆ ప్రేమను భరించడం ఆమె వల్ల కాలేదు. ప్రేమ పేరుతో భర్త పెట్టే హింసను భరించలేక కుమిలిపో తుందామె. అలాంటప్పుడే ఓ రోజు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోతుంది. తర్వాత వేరే చోటికి చేరుతుంది. మరి ఆమె మళ్లీ తనకోసం వెతుకుతోన్న భర్తకి దొరుకుతుందా? కష్టాల్లో పడుతుందా? తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ‘రామా.. సీత..’ సీరియల్ చూడాలి.
మొదట ‘రామా... సీతెక్కడ’ అన్న టైటిల్ పెట్టినా, కొన్ని సమస్యల కారణంగా ‘రామా.. సీత’గా మార్చారు. పాత కథే అయినా కథనం ఆసక్తికరంగానే ఉంది. మీనాక్షిగా హీరోయిన్ నటన బాగుంది. కానీ శాడిస్టు భర్తగా హీరో నటన అంతంత మాత్రం. హావభావాలు ఎప్పుడూ ఒకేలా ఉండటమే కాక, డైలాగ్ డెలివరీ కూడా అంత బాగా లేదు. సీరియస్‌గా కనిపించే ప్రయత్నంలో బిగుసుకుపోతు న్నట్టుగా కనిపిస్తున్నాడు. అదొక్కటే సీరియల్‌కి మైనస్!