కార్తీకదీపం మే 11: డాక్టర్ భారతీ మోనితతో ‘భార్యభర్తలను విడదీయాలనుకోవడం అన్యాయమని, నిది నిజమైన ప్రేమ కాదు. ఉన్మాదం. కార్తీక్‌ను ప్రేమిస్తే ప్రేమించావ్.. కానీ నీకు సాయం కాదు కదా మద్దతు కూడా ఇవ్వను’ హెచ్చరించి వెళుతుంది. ఆ తర్వాత మోనిత జరిగిదంతా గుర్తుచేసుకుంటూ కోపంతో రగిలిపోతుంది. హెల్ప్ చేయకుంటే చేయకు నాకు నేను హెల్ప్ చేసుకుంటాను. ఎప్పటికీ దీపను కార్తీక్‌తో కలవనివ్వను, సుఖంగా కాపురం చేసుకొనివ్వను అంటూ తన క్రూరత్వాన్ని చూపిస్తుంది. ఇదిలా ఉండగ ఆదిత్య, శ్రావ్యలు మేడపైన కూర్చుని ఇంట్లో అసలు ఏం జరుగుతుంది. నువ్వు ఏం చేయట్లేదేంటి ఆదిత్య అంటుంది శ్రావ్య. సడెన్‌గా అత్తయ్య, మామయ్య ఎక్కడికి వెళ్లారు, అంత అర్జెంటుకు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది అంటుంది శ్రావ్య.
అలాగే ఈమధ్య అత్తయ్య బావగారికే సపోర్టు చేస్తూ మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే ఇంకేదో ఉందంటూ ఇంట్లో సమస్యల గురించి మాట్లాడుకుంటుంటారు. ఈలోపు హిమ, సౌర్యలు వాళ్ల దగ్గరికి వెళ్లి ఇంట్లో ఎవరులేరేంటని అడుగుతారు. అమ్మ ఎక్కడికి వెళ్లింది, ఇంట్లో కనిపించడం లేదని అడగడంతో శ్రావ్య, ఆదిత్యలు కంగారు పడుతూ కిందికి వెళ్లి దీప కోసం వెతుకుతుంటారు. ఇంతలో కార్తీక్ ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తాడు. వదిన ఇంట్లో కనిపించడం లేదు అన్నయ్య అంటాడు ఆదిత్య. దీంతో కార్తీక్ కనిపించకుంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అంటాడు. నువ్వు ఆస్పత్రికి తీసుకేళ్లావేమో అనుకున్నాము అని ఆదిత్య అంటుండగా సౌర్య, హిమా కార్తీక్‌ని చూసి ఏడుస్తూ వస్తారు.
అమ్మ లేదు డాడీ అని చెప్పగానే కార్తీక్ మీరు ఏం టెన్షన్ పడకండి ఎక్కడికి వెళుతుంది మిమ్మల్ని వదిలి అంటూ ఓదారుస్తాడు. మీరు పిల్లల్ని చూసుకోండి దీపను నేను తీసుకుని వస్తానంటూ కార్తీక్ అంటుండగా ఆదిత్య నీకు తెలుసా వదిన ఎక్కడికి వెళ్లిందో అని ప్రశ్నిస్తాడు. పిల్లల్ని వదిలి మీ వదిన ఎక్కడికి వెళుతుంది రా చెప్పింది చేయ్ అంటాడు. ఇక కార్తీక్, దీపను వేతికే పనిలో ఉండగా మోనిత కాల్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావ్ భారతిని తీసుకురానా దీపకు నచ్చజెపుతుందని అంటుతుంది. దీంతో కార్తీక్ నేను బయట ఉన్నాను ఇప్పుడు అవసరం లేదని విసుగ్గా అంటాడు. దీంతో.. దీప మళ్లీ తట్టాబుట్ట సర్దేసిందా అంటుంది మోనిత. కార్తీక్ షాకై నీకేలా తెలుసని అనగా.. గెస్ చేశా అంటుంది మోనిత. దీంతో కార్తీక్ ఫోన్ కట్ వెళ్తుండగా మధ్యలో దీప తండ్రి మురళీ కృష్ణ ఎదురు పడతాడు. కార్తీక్ మురళీకృష్ణతో మీ అమ్మాయి కనిపించడం లేదు అని చెప్పగానే మీ ఇంట్లో లేదు.. అవును అని కార్తీక్ అంటుండగా.. మా ఇంట్లో కూడా లేదు అంటాడు మురళీకృష్ణ.
వెతకడానికి బయలుదేరారా అని అడుగుతూ.. ఎక్కడ దొరుకుతుందని బయలుదేరారని మురళీకృష్ణ ప్రశ్నిస్తూ.. మీ ఇంట్లో పొగుట్టుకున్న దాన్ని లోకంలో ఎక్కడని వెతికి పట్టుకుందామనుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. మా అమ్మాయి పిచ్చిది పదేళ్ల క్రితం పొగొట్టుకున్నదాన్ని మళ్లీ పదేళ్ల తర్వాత మీ ఇంట్లో వెతుక్కుందామని వచ్చింది అని అనగా.. అది మీ అమ్మాయి అమాయకత్వం అంటాడు కార్తీక్. మరీ మీదీ అని మురళీకృష్ణ అడగ్గా.. నాకేం సంబంధం లేదంటూ.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అలాంటి ఆలోచన కూడా లేకుండా వెళ్లిపోయింది అంటాడు. అయితే పిల్లలకు తల్లి అవరమా అని మురళీ కృష్ణ అనగానే అదేం ప్రశ్న అంటాడు కార్తీక్. మరీ నా కూతురికి తెలియదా తల్లి లేకుంటే పిల్లలు తల్లడిల్లుతారని, అయినా వెళ్లిందంటే అర్థమేంటి అని ప్రశ్నించగా.. అది మీ కూతురి మూర్ఖత్వం అంటాడు కార్తీక్. చేసిందంత మీరు చేసి దాన్ని దోషిని చేస్తారేంటి అంటూ కార్తీక్‌ని మురళీకృష్ణ నిలదిస్తాడు. ఇక ఆ తర్వాత ఏమైందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment