‘ముద్దు సీన్‌ గురించి అమ్మతో చర్చించాకే..’ | Hina Khan Reveals Her Journey From Srinagar To Cannes Film Festival | Sakshi
Sakshi News home page

‘ముద్దు సీన్‌ గురించి అమ్మతో చర్చించాకే..’

Published Mon, Dec 21 2020 1:36 PM | Last Updated on Mon, Dec 21 2020 1:44 PM

Hina Khan Reveals Her Journey From Srinagar To Cannes Film Festival - Sakshi

బాలీవుడ్‌ నటి హీనా ఖాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 11 ఏళ్ల క్రితం ‘యే రిష్‌తా క్యా కెహ్లాతా హై’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా ఖాన్‌. ఆ తర్వాత బిగ్‌బాస్‌ షోతో మరింత ప్రచారం పొందారు‌. ఇక ఆమె నటించిన తొలి చిత్రం కేన్స్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా సత్తా చాటారు హీనా ఖాన్‌. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో తన ప్రయాణం గురించి హ్యూమన్స్‌ బాంబేతో పంచుకున్నారు హీనా ఖాన్‌. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నేను సనాతన కాశ్మీరీ కుటుంబం నుంచి వచ్చాను, అక్కడ నటన అనే మాట నిషిద్ధం. కాలేజీ చదువుల నిమిత్తం నన్ను ఢిల్లీ పంపేందుకు నా తల్లిదండ్రులు సందేహించారు. కానీ నాన్నను ఒప్పించి ఢిల్లీ వచ్చాను. ఆ సమయంలో ఓ స్నేహితురాలు సీరియల్‌ కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయి. నువ్వు వెళ్లు అని చెప్పింది. నేను నో చెప్పాను. కానీ తను వదలలేదు. అలా తన బలవంతం మీద నేను ఆడిషన్‌కి వెళ్లాను. తర్వాతి రోజే నేను సెలక్ట్‌ అయినట్లు కాల్‌ వచ్చింది’ అన్నారు. 

‘అలా 20 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లాను. ఇల్లు వెతుక్కొవడంలో ప్రొడక్షన్‌ వాళ్లు నాకు ఎంతో సాయం చేశారు. ఇక నేను నటిస్తున్నాననే విషయం గురించి నాన్నతో చెప్పడానికి నాకు కొన్ని వారాలు పట్టింది. విషయం వినగానే ఆయన షాక్‌ అయ్యారు. అమ్మ స్నేహితులు, బంధువులు మా కుటుంబంతో బంధాలు తెంచుకున్నారు. కానీ నా సీరియల్‌ పాపులర్‌ అయ్యింది. కొన్నేళ్లపాటు టాప్‌లో కొనసాగింది. ఇక నాన్న కూడా అంగీకరించారు. కానీ చదువు కూడా కొనసాగించాలని కండిషన్‌ పెట్టారు. దాంతో బ్రేక్‌ టైంలో వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. అమ్మవాళ్లు ముంబైకి మారారు’ అన్నారు. (చదవండి: ఇద్దరినీ ఇష్టపడి.. పెళ్లి చేసుకున్నా)

బిగ్‌బాస్‌ ఎంట్రీతో మొత్తం మారిపోయింది
‘అలా ఎనిమిది సంవత్సరాల పాటు సీరియల్‌లో కొనసాగాను. ఇలా ఉండగానే 2017లో బిగ్‌బాస్‌ 11 ఆఫర్‌ వచ్చింది. అయితే సీరియల్స్‌లో నటించే సమయంలో నేను ‘షార్ట్స్‌ వేసుకోను.. అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించనని’ కండిషన్స్‌ పెట్టాను. కానీ బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చేనాటికి నా సొంత నియమాలు రూపొందించుకున్నాను. ఇక మా అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూడ్డం ప్రారంభించారు. దాంతో నేను రాకీ గురించి వారికి చెప్పాను. ఇది విని కుటుంబంలో అందరు షాక్‌ అయ్యారు. కానీ చివరకు ఒప్పుకున్నారు. ఇప్పుడు మా అమ్మనాన్న నా కంటే ఎక్కువ తననే ప్రేమిస్తారు’ అని తెలిపారు. (చదవండి: పదేళ్లుగా డేటింగ్‌.. ఇప్పుడు బ్రేకప్)

సినిమాల్లోకి వెళ్లే రిస్క్‌ చేశాను
‘ఇక టీవీ అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న వేళ నేను ధైర్యం చేసి సినిమాల్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాను. ఇక నా మొదటి చిత్రం గతేడాది జరిగిన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి ఎంపికయ్యింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఆ తర్వాత ఓటీటీలోకి ప్రవేశించాను. ఇక స్క్రిప్ట్‌లో భాగంగా ముద్దు సీన్‌లో నటించాల్సి వచ్చింది. దీని గురించి అమ్మనాన్నలకు చెప్పి.. వారు అర్థం చేసుకుని అంగీకరించిన తర్వతే ఆ సీన్‌కి ఎస్‌ చెప్పాను. ఆ చిత్రం ఇప్పుడు ఆన్‌లైన్‌లో అత్యధిక మంది చూసిన చిత్రాల జాబితాలో చేరింది. నేను మొట్టమొదట కెమెరాను ఎదుర్కొని 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. శ్రీనగర్‌లో పుట్టిన చిన్నారి కేన్స్ వరకు వెళ్లడం గురించి నిజంగా ఊహించలేదు. కానీ కష్టమైన ఎంపికల శ్రేణి నన్ను ఇక్కడ వరకు నడిపించింది. శ్రీనగర్ నుంచి ముంబై వరకు చేరిన నా ప్రయాణంలో నా కుటుంబంలో.. మొదటి నటి నుంచి వేరే సమాజానికి చెందిన వారితో డేటింగ్ చేయడం వరకు నా స్వంత మార్గాన్ని నేనే ఏర్పాటు చేసుకున్నాను అని గర్వంగా చెప్పగలను’ అన్నారు హీనా ఖాన్‌‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement