Protests Flare Near Paris After 17-year-old Shot Dead During Police Traffic Stop, See Details - Sakshi
Sakshi News home page

Protests In Paris: భగ్గుమన్న ఫ్రాన్సు

Published Fri, Jun 30 2023 4:58 AM | Last Updated on Fri, Jun 30 2023 11:29 AM

Protests flare near Paris after 17-year-old shot dead during police traffic stop - Sakshi

పారిస్‌ శివారులో తగలబడుతున్న కార్లు

పారిస్‌: పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి ఘటనతో ఫ్రాన్సు భగ్గుమంది. పారిస్‌ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్‌ స్టాప్‌ వద్ద మంగళవారం నహెల్‌ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు.

ముఖ్యంగా పారిస్‌ నగరంలోని స్కూళ్లు, టౌన్‌హాళ్లు, పోలీస్‌ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు, ఇతర ఆస్తులకు నిప్పంటించారు. రాళ్లు రువ్వారు. వీటిని నిలువరించేందుకు పోలీసులు పలుమార్లు బాష్పగోళాలు ప్రయోగించారు. దాడుల్లో 100కు పైగా ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నట్లు అంచనా వేసింది. ఆందోళనకారుల దాడుల్లో 170 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీటన్నిటికీ చెక్‌ పెట్టేందుకు ఫ్రాన్సు ప్రభుత్వం నిర్ణయించింది.

సిబ్బంది, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సు, రైలు సర్వీసులను నిలిపివేసింది. దీని ఫలితంగా రాజధాని, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాడులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ప్రస్తుతమున్న పోలీసుల సంఖ్యను 9 వేల నుంచి 40 వేలకు పెంచింది. నిరసనకారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. యువకుడిపై కాల్పుల ఘటనకు కారకులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement