సాక్షి, కృష్ణా: టీడీపీ నేత పట్టాభి విషయంలో ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్టాభి విషయంలో ఏం జరిగిందో ఎస్పీ జాషువా కీలక విషయాలు వెల్లడించారు. టీడీపీ లీడర్ పట్టాభిని పోలీసులు కొట్టారనేది అవాస్తమని స్పష్టం చేశారు.
కాగా, ఎస్పీ జాషువా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నిందలు వేయడం సరికాదు. పట్టాభి అవాస్తవంతో కోర్టును తప్పుదారి పట్టించాలని చూశారు. పట్టాభి కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు. డాక్టర్ల బృందం రెండుసార్లు పరీక్షించినా ఎలాంటి గాయం లేకపోవడంతో పట్టాభి వ్యూహం విఫలమైంది. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినా సుమోటోగా కేసు నమోదు చేశాం. వీడియో ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి, ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment