అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా!. సంక్షేమ ప్రభుత్వంపై పడి ఏడుపు రాతలు రాసే ఈనాడు తీరే అంతేనేమో. రామోజీరావు స్వయంగా పర్యవేక్షించే ఈ పత్రికలో.. సీఎం జగన్ సర్కార్‌పై తప్పుడు రాతలు, ఫేక్ కథనాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. తాజాగా బొక్కబొర్లాపడే రీతిలో మరో అడుగేసింది ఈనాడు. అదీ మరీ సోయిలేని రీతిలో వ్యవహరించడమే ఇక్కడ గమనార్హం!.
ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పచ్చ మీడియా ఎప్పుడూ అసత్య ప్రచారమే చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా పచ్చ మీడియాకు తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతూ ప్రజలకు నిజలేంటో చెబుతూనే ఉంది. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసి ‘ఈనాడు’ అడ్డంగా దొరికిపోయింది. దీంతో చేసేదేమీ లేక తప్పు ఒప్పుకుని చింతిస్తున్నామంటూ ప్రకటనతో చేతులు కడిగేసుకుంది. కానీ, అది వదిలే మరక కాదని సంగ్రహించలేకపోయింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
తప్పులు సహజం కావొచ్చు. కానీ, ఈనాడు చేసిన తప్పిదం చిన్నదైతే కాదు. రెండేళ్ల క్రితం గన్నవరం ఘటనలో జగన్ సర్కార్‌పై కూడగలుపుకుని ‘ఈనాడు’, టీడీపీ దుష్ప్రచారం చేశాయి. టీడీపీ నేత పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ విష ప్రచారం చేశాయి. చంద్రబాబు డైరెక్షన్‌లో.. రామోజీ యాక్షన్‌లో ఈనాడు ఓ పె.. ద్ద కథనం రాసుకొచ్చింది. అయితే, 2021 నాటి ఘటనలోని ఫొటోలనే ఈనాడు తాజాగా ప్రచురించి అభాసుపాలైంది. రెండేళ్ల క్రితం ఫొటోలను ప్రచురించి.. ప్రస్తుతం జరిగిన ఘటనలో పట్టాభిని కొట్టారంటూ కలరింగ్ ఇచ్చింది ఈనాడు. ఇక, దొరికిందే సందు అన్నట్టుగా ఈ వార్తలను టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం గమనార్హం.
టీడీపీ.. ఈనాడు తప్పుడు ఫొటో కథనాలను ట్వీట్ చేసి సీఎం జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. ఇదే అదునుగా పట్టాభిని కొట్టారంటూ కోర్టులో ఈనాడు ఫొటోలను ఆయన న్యాయమూర్తులు కోర్టులో చూపించారు. అనంతరం, వైద్యులు.. పట్టాభికి ఎలాంటి గాయాలు లేవని పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని ధృవీకరించారు. అయితే, వైద్యుల ధృవీకరణతో ఈనాడు అసలు బండారం బయటపడింది. ప్చ్.. చేసేదేమీ లేకపోవడంతో చింతిస్తున్నామంటూ ఈనాడు బహిరంగంగానే ఓ నోట్‌ను విడుదల చేసింది. ఈ ఫొటోలు 2021 నాటివి అని ఒప్పుకుంది. టోటల్‌గా చంద్రబాబు దుష్ట రాజకీయంతో పత్రికా విలువలను పక్కనపెట్టి.. పరువు పొగొట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment