
సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)
ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో కూడిన సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సిట్‌లో సభ్యులుగా.. ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు..వీ శ్రీనివాసరావు, రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జి ఐ శ్రీనివాస్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్‌లు సిట్ సభ్యులుగా నియామకమయ్యారు.
కాగా ఎన్నికల వేళ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్రపైన విచారణ జరపనుంది. రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment