అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స | Botsa Satyanarayana Meets Governor On Violence After Elections Polling In AP, More Details Inside | Sakshi
Sakshi News home page

Botsa Satyanarayana: తొందరపాటు నియమకాల వల్లే హింసాత్మక ఘటనలు

Published Fri, May 17 2024 4:56 PM | Last Updated on Fri, May 17 2024 6:00 PM

Botsa Satyanarayana Meets Governor On Violence In elections

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల కమిషన్ నియమించిన రిటైర్డ్‌ పోలీసు అధికారి ఏక పక్ష నిర్ణయంపై గవర్నర్‌ను కలిసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారి మార్పులో జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల కొన్ని ఘటనలు జరిగాయని, అందుకే  కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏ ప్రాంతంలో అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయని అన్నారు.

తొందరపాటు నియమకాల వల్ల హింసాత్మక ఘటనలు జరిగాయని మంత్రి బొత్స పేర్కొన్నారు అధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వపరాలు తెలుసుకోవాలని తెలిపారు. రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. హింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని స్పష్టం చేశారు. 

ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా తమపై నిందలు వేయడం సరికాదని అన్నారు. హింసాకాండకు వైఎస్సార్‌సీపీ పూర్తి వ్యతిరేకమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నట్లు చెప్పారు.

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

మళ్లీ అధికారంలో వచ్చేది తామనేనని అన్నారు బొత్స సత్యనారాయణ. 175 సీట్లకు దగ్గరగా గెలవబోతున్నామని చెప్పారు. జూన్‌ 9న విశాఖలోనే సీఎంగా వైఎస్‌ జగన్‌మోమన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు.  

‘టీడీపీ ఫలితాల పై ఢీలా పడింది.. అందుకే మహానాడు వాయిదా వేసుకున్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చిన్న చిన్న సంఘటనలను ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాడే ప్రయత్నం చేయొద్దు. పోలీసులు కూడా న్యాయ బద్దంగా వ్యవహరించండి. రాజకీయ పార్టీలు హింసను ప్రోత్సహించవద్దు. వైయస్సార్ సీపీ అలాంటి హింసలు ప్రోత్సహించదు. నిన్న విశాఖ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఓ ఘటనను రాజకీయం చేస్తున్నారు

త్వరలో విశాఖ కేంద్రంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభిస్తున్న దశలో విశాఖ ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. విశాఖ ప్రశాంతతను కాపాడాలని కోరుకుంటున్నా. .రాజకీయ నాయకునిగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావాలని కోరుకోవాలి. కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మా పార్టీ సీట్లు అవసరం వుండేలా కేంద్రంలో అధికారం రావాలని కోరుకుంటున్నా. ఉత్తరాంధ్ర లో 34 సీట్లు వస్తాయి. ప్రజా తీర్పు ఆధారంగా విశాఖ పరిపాలన రాజధాని చేయాలని కోర్టును కూడా కోరుతాo’ అని పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement