
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఏపీలో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యధికంగా 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.
తాజాగా ఏపీలో నమోదైన పోలింగ్, ఓటర్లను ఉద్ధేశిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మండుటెండల్లోనూ తనకు ఓటువేసి ఆశీర్వదించేందుకు సునామీల తరలివచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన పాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024

Comments
Please login to add a commentAdd a comment