AP Election Polling
-
ఏపీలో పోలింగ్ రోజు పచ్చమూకల విధ్వంసం
-
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్
సాక్షి, అమరావతి: పోలింగ్ అనంతరం దాడులు జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లాయని సిట్ సారథి వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. క్లూస్ టీమ్స్‌తో కలిసి సిట్ అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని తెలిపారు. వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్‌కు రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నామని, రెండ్రోజుల్లో సిట్ కీలక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.డీజీపీ హరీష్ గుప్తాతో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ భేటీ అయ్యారు .సుమారు 30 నిమిషాలపాటు వీరిరువురి మధ్య సమావేశం జరిగింది. హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్లు డీజీపీకి వినీత్ తెలిపారు. ఇప్పటి వరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించనుంది. ఎఫైఆర్లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా?..లేదా సెక్షన్లు మార్చాల అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు కేసులు కట్టకపోతే..సిట్ కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయించనుంది. కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై ఆరా తీస్తుంది. ఎప్పటికప్పుడు సిట్ పనితీరు డీజీపీకి అందించేలా పరివేక్షణ జరుగుతోంది.మరోవైపు ఎన్నికల హింసపై సిట్ ముమ్మర దర్యాప్తు జరుపుతోంది. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఏర్పడిన్ సిట్.. నిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారంభించింది.3 జిల్లాలకు మూడు బృందాలను నియమించారు వినీథ్ బ్రిజ్‌లాల్. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో సిట్ విచారణ జరుపుతోంది. తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావు పేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ఫోకస్ చేస్తోంది.హింసకు కారణమైన పోలీస్ అధికారుల ఊపాత్రమైనా విచారణ జరుపుతోంది. హింస ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్షణ్ణంగా పరిస్తోంది.ఇదిలా ఉండగా సస్పెండెడ్ ఎస్పీ బిందు మాధవ్‌ను విచారిస్తోంది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను బిందుమాధవ్ కలిశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల అల్లర్లు, హింసాత్మక ఘటనలపై విచారణ జరుపుతున్నారు. గురజాల, మాచర్ల, నరసరావు పేట, సత్తెనపల్లిలో హింసపై విచారిస్తున్నారు. -
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో కూడిన సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.సిట్‌లో సభ్యులుగా.. ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు..వీ శ్రీనివాసరావు, రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జి ఐ శ్రీనివాస్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్‌లు సిట్ సభ్యులుగా నియామకమయ్యారు.కాగా ఎన్నికల వేళ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్రపైన విచారణ జరపనుంది. రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. -
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
-
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
-
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
-
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
-
ఏపీ పోలింగ్‌పై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఏపీలో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యధికంగా 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.తాజాగా ఏపీలో నమోదైన పోలింగ్, ఓటర్లను ఉద్ధేశిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మండుటెండల్లోనూ తనకు ఓటువేసి ఆశీర్వదించేందుకు సునామీల తరలివచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్సీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన పాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024 -
అక్కడ రీ-పోలింగ్ ?
-
టీడీపీ దాడులపై అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
-
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
-
పోలింగ్ బూతును పరిశీలించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
-
ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ ఫ్యామిలీ
-
కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కు వినియోగించుకున్న కొడాలి నాని
-
ఈసీ అధికారిక ప్రకటన ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం
-
సదుపాయాల విషయం లో అధికారులు అప్రమత్తం అవ్వాలి
-
మళ్ళీ గెలిచేది జగనే.. ఓటు హక్కు వినియోగించుకున్న తానేటి వనిత
-
ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై స్పందించిన ఎమ్మేల్యే
-
అన్న రెండోసారి సీఎం గ్యారంటీ
-
పోలింగ్ ఏజెంట్ పై టీడీపీ మూకల దాడి
-
ఓటు హక్కు వినియోగించుకున్న తండ్రి కొడుకులు
-
మాట మీద నిలబడి మంచి చేసి నాయకుడు: RK రోజా
-
చక్కదిద్దుకునే అవకాశం మీ చేతుల్లోనే ఓటు హక్కును వినియోగించుకోండి
-
ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)
-
ఓటు హక్కు వినియోగించుకున్న YSRCP నేతలు
-
ప్రతి ఓటరు మీ హక్కును వినియోగించుకోండి: మురుగుడు లావణ్య
-
ప్రజలు ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా మంచి వైపే నిలబడతారు
-
ఓటు హక్కు వినియోగించుకున్న రోజా,కుమార్తె అన్షు
-
ఓటు లేని భార్యతో పోలింగ్ కేంద్రంలో కి పవన్ కళ్యాణ్
-
నిబంధనలు ఉల్లంఘించిన బాలకృష్ణ పార్టీ కండువా తో పోలింగ్ స్టేషన్ కు..!
-
ఓటు హక్కు వినియోగించుకున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి
-
ఓటు హక్కు వినియోగించుకున్న అంబటి దంపతులు..
-
ఓటు హక్కు వినియోగించుకున్న నారా ఫ్యామిలీ
-
అవ్వ ప్రేమ కు పేర్ని నాని ఫిదా
-
ఓటు వేసిన సీఎం జగన్ కుమార్తెలు
-
పిఠాపురంలో మహిళా ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తుంది
-
మునుపటి కంటే ఈసారి అధిక శాతం ఓటింగ్
-
పాముల పుష్ప శ్రీవాణి ఓటు వేశారు
-
ఓటు హక్కు వినియోగించుకున్న పేర్ని నాని కుటుంబ సభ్యులు
-
భారీ సంఖ్యలో తరలివస్తున్న ఓటర్లు
-
ఓట్ హక్కు వినియోగించుకున్న విజయ్ సాయి రెడ్డి, దేవినేని అవినాష్
-
శిల్పా నా ఫ్రెండ్.. నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..
-
సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు వేశారు
-
ఎన్నికలకు సర్వం సన్నద్ధం..
-
రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (ఏప్రిల్ 18) నోటిషికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వేలు బంద్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీపోల్ సర్వే కానీ, ఒపినియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. -
చరిత్ర ఏం చెబుతుందంటే.. విపక్షాలవి పగటి కలలే.!
సాక్షి, ఆంధ్రప్రదేశ్: 1956–2014 మధ్య ఉనికిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌లో 1982లో తెలుగుదేశం ఏర్పాటయ్యాకే రెండు ప్రధాన రాజకీయపక్షాల మధ్య అధికారం కోసం గట్టి పోటీ జరిగే పరిస్థితులు వచ్చాయి. అంటే, 1983 ఏపీ శాసనసభ ఎన్నికల నుంచి మాత్రమే ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షానికి 30 శాతానికి పైగా ఓట్లు రావడం మొదలైంది. 1953–56 మధ్య మూడేళ్లు ఉనికిలో ఉన్న ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఒకే ఒక ఎన్నికల్లో ప్రతిపక్షానికి పడిన ఓట్లు 30 శాతం దాటాయి. 1955లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)కి 31.13% ఓట్లు దక్కాయి. అయితే, దాదాపు మూడో వంతు శాతం ఓట్లు దక్కించుకున్నాగాని కమ్యూనిస్టులకు ఈ ఎన్నికల్లో మొత్తం 190 సీట్లకుగాను కేవలం 15 స్థానాలే లభించాయి. కాంగ్రెస్ కూటమికి, సీపీఐకి మధ్య దాదాపు అన్ని చోట్లా పోటీ తీవ్రంగా ఉండడమే ఈ అసాధారణ ఫలితాలకు కారణం. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో 1983 ఎన్నికల ముందు వరకూ ఇలా దాదాపు మూడో వంతు ఓట్లు (30%) దక్కించుకున్న ప్రధాన ప్రతిపక్షం ఏదీ లేదు. 1957, 62, 67, 72 ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌కు దాదాపు ఎదురులేని పరిస్థితి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ చివరి మూడు ఎన్నికలే రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. 1957లో తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 105 స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షమైన సీపీఐ 25.73% ఓట్లతో 22 సీట్లు సంపాదించగలిగింది. విశాల తెలుగురాష్ట్రంలో మొదటిసారి అంతటా జరిగిన 1962 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ అత్యధికంగా 19.13% ఓట్లు సంపాదించి, 51 సీట్లు సాధించింది. అయితే, అప్పటికీ బలహీనపడిన సీపీఐ నాటి ఏపీ అసెంబ్లీలోని మొత్తం 300 సీట్లకు గాను 136 సీట్లలో మాత్రమే పోటీచేయగలిగింది. ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (1967, 1972) ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి కనీసం 10% ఓట్లు దక్కలేదు. 1978 ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ కాసు బ్రహ్మానందరెడ్డి, ఇందిరాగాంధీ నాయకత్వంలో రెండు పార్టీలుగా దేశవ్యాప్తంగా చీలిపోయింది. ఈ చీలిక తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన 1978 ఫిబ్రవరి ఎన్నికల్లో మాత్రమే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా పార్టీకి రాష్ట్రంలో 28.85 శాతం ఓట్లు, 60 సీట్లు దక్కాయి. (ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (ఆర్) తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు నాయకత్వంలోని పార్టీకి 17% ఓట్లు, 30 సీట్లు దక్కాయి.) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1983 ఎన్నికలకు ముందు ఒక ప్రతిపక్ష పార్టీకి పాతిక శాతం వరకూ ఓట్లు వచ్చిన ఏకైక సందర్బం ఇదే. మూడో పక్షానికి 15% ఓట్లు దాటిన ఏకైక సందర్భం 2009 అసెంబ్లీ ఎన్నికలే! 1980ల ఆరంభంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షానికి (కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్) ప్రతిసారీ 30 శాతానికి పైగానే ఓట్లు లభించాయి. 1994 ఏపీ పదో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 26 సీట్లు (మొత్తం 294కు) మాత్రమే దక్కించుకున్నప్పుడు కూడా ఈ పార్టీకి పోలైన ఓట్లలో 33.85% వచ్చాయి. ఈ పదో శాసనసభ ఎన్నికల తర్వాత మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలోకి దిగిన ప్రాంతీయపక్షానికి 15 శాతానికి మించిన ఓట్లు లభించిన సందర్భం 2009 అసెంబ్లీ ఎన్నికలే. ఈ ఎన్నికలకు 8 మాసాల ముందు ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)కి 16.2 శాతం ఓట్లు, 18 సీట్లూ ఈ ఎన్నికల్లో లభించాయి. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలోగాని, రెండు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ)గాని మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల పోరుకు దిగిన ఏ పార్టీకి కనీసం 15 శాతం ఓట్లు దక్కలేదు. 2023 నవంబర్–డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ మూడో ఎన్నికల్లో తృతీయ ప్రత్యామ్నాయంగా భావించిన బీజేపీకి గరిష్ఠంగా 13.9 శాతం ఓట్లు, 8 సీట్లూ దక్కాయి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లోనూ (2014, 2019) మూడో ప్రధాన పార్టీగా బరిలోకి దిగిన ఏ రాజకీయపక్షం కూడా కనీసం ఆరు శాతం ఓట్లు సంపాదించుకోలేదు. ఇలా తెలుగునాట రెండు ప్రధాన రాజకీయపక్షాలే ఒకదాని తర్వాత మరొకటి (ఒక్కోసారి వరుసగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాగాని) సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయేగాని మూడో ప్రత్యామ్నాయ పార్టీకి లేదా కూటమికి అవకాశం ఇవ్వలేదు. విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP ఇవి చదవండి: ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
అత్తిలి(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో మంగళవారం చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 150 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్, వైస్ ఎంపీపీలు సుంకర నాగేశ్వరరావు, దారం శిరీష, అత్తిలి టౌన్ అధ్యక్షుడు పోలినాటి చంద్రరావు, ఉపసర్పంచ్ మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జన బలమే గీటురాయి.. -
‘కోడ్’ ముగిసినా ఎక్కడి అధికారులు అక్కడే
సాక్షి, అమరావతి : ఎన్నికల నిబంధనావళి అమల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన అధికారులు ‘కోడ్’తో నిమిత్తం లేకుండా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసినందున వారిని పాత జిల్లాలకు పంపించాలా? లేక ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలా? అనేది కీలకమైన అంశమైనందున ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే కొనసాగించాలా? లేక ఎన్నికల ముందు వరకూ పనిచేసిన జిల్లాలకు తిరిగి బదిలీ చేయాలా? అనే అంశంపై స్పష్టమైన విధివిధానాల్లేవు. అందువల్ల కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అమలుచేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే, ఎన్నికలు ముగిసినందున ఎన్నికల ముందు పనిచేసిన స్థానాలకే అధికారులను తిరిగి బదిలీ చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ, ఇలాంటి నిబంధనేమీ లేదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. కొత్త ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఎలా చెబితే అలా చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఫైలును సీఎం పరిశీలన కోసం పంపింది. ఎందుకిలా? రాష్ట్రంలో విధానసభ, దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్.. మోడల్ కోడ్ (నిబంధనావళి) ప్రకారం రెవెన్యూ శాఖలో 530 మందికి పైగా తహసీల్దార్లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఇదే నిబంధనావళి ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇతర శాఖల్లో ఇదే కేడర్‌లో పనిచేస్తున్న మరికొందరిని కూడా వేరే జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల కమిషన్ విధుల్లో భాగస్వాములను చేసే వారిని సొంత జిల్లాల నుంచి వేరే జిల్లాలకు బదిలీ చేయాలని నిబంధన ఉంది. అలాగే, మూడేళ్లుపైగా ఒకేచోట ఉన్న వారిని కూడా బదిలీ చేయాలని ఉంది. దీంతో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న ఆయా శాఖల అధికారులను బదిలీ చేశారు. కొందరు రెవెన్యూ డివిజనల్ అధికారులు సైతం ఇలాగే బదిలీ అయ్యారు. ఈ బదిలీలన్నీ మార్చి 10న వచ్చిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే జరిగాయి. ఈ నేపథ్యంలో.. ‘ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించిన అనంతరమే బదిలీ అయిన వారిని పూర్వ స్థానాలకు పంపించాలా? ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. అందుకోసం ఫైలు ఇప్పటికే పంపించాం’.. అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇతర విభాగాల వారి విషయంలోనూ ఇదే విధానం అమలవుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. సాధారణ పరిపాలన వేగవంతం ఇదిలా ఉంటే.. ఎన్నికల కోడ్ ముగిసినందున అధికార యంత్రాంగం ఇక పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత మూడు నెలలుగా ఎన్నికల పనులు, తర్వాత ‘కోడ్’ అంటూ క్షేత్రస్థాయి అధికారులు ప్రజల వినతులు, సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో రెవెన్యూ కార్యాలయాల్లో రోజువారీ సాగాల్సిన పనులన్నీ స్తంభించాయి. ‘వాస్తవంగా పట్టాదారు పాసుపుస్తకాల జారీ, రెవెన్యూ రికార్డుల మార్పులు చేర్పులు, సవరణలు (మ్యుటేషన్), భూముల కొలతలు, వ్యవసాయ ఆధార ధ్రువీకరణ పత్రాల జారీ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సాధారణ కార్యకలాపాలు నిత్యం చేయాల్సిందే. ఇవి ఎన్నికల కోడ్ పరిధిలోకి రావు. అయితే, అధికారులు పని భారాన్ని సాకుగా చూపుతూ ఈ పనులను నిలిపేశారు. ఇప్పుడు ఎన్నికల క్రతువు ముగిసినందున అధికారులు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం’.. అని ఒక ఉన్నతాధికారి వివరించారు. ముగిసిన ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రంలో శాసనసభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ‘కోడ్’.. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో దాని కాల పరిమితి ముగిసిందని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కార్యదర్శి అజయ్‌కుమార్ తెలిపారు. ‘దేశవ్యాప్తంగా లోక్‌సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడి కావడంతో మోడల్ కోడ్‌ను ఎత్తివేస్తున్నాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం మొత్తానికి తెలియజేయండి’.. అని అజయ్ కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్ సర్క్యులర్ జారీచేసింది. -
ప్రతిపక్ష నేత ఎవరు?
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుంగిపోయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్న విషయం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. తీవ్ర అవమానభారంతో ప్రజలకు మొహం చూపించేందుకు సైతం వెనుకాడుతున్న ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడడంలేదని పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఫలితాల తర్వాత రెండు రోజుల నుంచి తనను కలుస్తున్న నాయకులతో ఆయన మాట్లాడుతున్న తీరు ఈ ప్రచారానికి దారితీసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 151 ఉండడం, తన వయసు రీత్యా అసెంబ్లీలో వారిని ఎదుర్కోవడం వంటి కారణాలను చూపి ప్రతిపక్ష నేత బాధ్యతలకు దూరంగా ఉంటే ఎలా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండి, గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరికి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయని నాయకులు చర్చించుకుంటున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కింజరాపు అచ్చెన్నాయుడు, కరణం బలరామకృష్ణమూర్తి తదితరుల్లో ఒకరిని ప్రతిపక్ష నేతగా పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన తమ అధినేత మదిలో ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేతగా తానుండాలా, ఎవరికైనా బాధ్యత అప్పగించాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలోనే ఇంతవరకూ పార్టీ శాసనసభాపక్ష సమావేశంపై నోరు మెదపడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దారుణ ఓటమితోనే వైరాగ్యం చంద్రబాబు వ్యవహార శైలి, ఆలోచనా తీరు తెలిసిన నేతలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోరని, ఆయనే ప్రతిపక్ష నేతగా ఉంటారని చెబుతున్నారు. ఓటమి భారంతో ప్రస్తుతం వైరాగ్యంగా మాట్లాడుతున్నా కొద్దిరోజుల్లో తేరుకుని మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలమవుతారని చర్చించుకుంటున్నారు. ఓటమిని ఆయన ముందే ఊహించినా అది ఇంతటి దారుణంగా ఉంటుందని అనుకోలేదని, రాష్ట్ర రాజకీయ చరిత్రనే తిరగరాసే రీతిలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గెలుపు ఓటములు సహజమే అయినా వైఎస్సార్ పార్టీకి 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు రావడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని, జగన్మోహన్రెడ్డికి ఈ స్థాయి ప్రజాదరణ ఎలా వచ్చింది, దాన్ని ఎందుకు గుర్తించలేకపోయానని బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బయటకు వచ్చేందుకు సైతం ఇష్టపడని ఆయన కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే ప్రతిపక్ష నేత ఎన్నికపై నిర్ణయం ఉంటుందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. పార్టీ భవిష్యత్తుపైనా, అంతకు మించి తన కుమారుడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న చంద్రబాబు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా లోకేష్‌ని పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మండలిలో యనమల రామకృష్ణుడు టీడీపీ పక్ష నేతగా ఉండగా ఆయన స్థానంలో లోకేష్‌ను పెడితే ఎలా ఉంటుందనే దానిపై చర్చిస్తున్నారు. -
దేశంలో అత్యధిక పోలింగ్ ఏపీలోనే
సాక్షి, అమరావతి: ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ నమోదుకాని విధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడం గర్వంగా ఉందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ట్వీట్ చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 80.31 శాతం పోలింగ్ నమోదయ్యిందన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కేవలం 67.47 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 79.64 శాతం ఓట్లు నమోదు కాగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాత మొత్తం పోలింగ్ 80.31 శాతానికి చేరింది. 2014లో నమోదైన 78.41 శాతంతో పోలిస్తే ఈ ఏడాది 1.9 శాతం అదనంగా ఓటింగ్ నమోదయింది. అదే విధంగా దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో ఏకంగా 12.84 శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయి ఓటింగ్ మన రాష్ట్రంలో మాత్రమే నమోదైనట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. చిన్న రాష్ట్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే 81.79 శాతం ఓటింగ్‌తో అస్సాం మొదటిస్థానంలో నిలిచింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, దివ్యాంగులు, పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లుపెద్దఎత్తున నమోదైనట్లు ద్వివేది తన ట్వీట్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈవీఎంలో నమోదైన ఓట్లకు వీవీప్యాట్ స్లిప్పులకు ఎక్కడా తేడా వచ్చినట్టు ఫిర్యాదు నమోదు కాలేదని ద్వివేది స్పష్టం చేశారు. -
పొరపాట్లకు ఛాన్సివ్వొద్దు
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఇవ్వడానికి వీల్లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. ఒక్కోసారి చిన్నపొరపాటే కొంపముంచుతుందని, అందుకు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు. గురువారం స్థానిక స్వర్ణభారతి ఆడిటోరియంలో ఆర్వోలు, ఏఆర్వోలు, సూపర్వైజర్లకు ఓట్ల లెక్కింపుపై శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా మాక్ కౌంటింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రతి ఒక్క అంశాన్ని వివరించారు. సువిధ యాప్ నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు. డేటాను మొదట ఎంట్రీచేసిన తర్వాతనే రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించాలన్నారు. శిక్షణలో జేసీ – 2 ఎం.వెంకటేశ్వరరావు, విశాఖ, అనకాపల్లి ఆర్డీవోలు తేజ్‌భరత్, సూర్యకళ పాల్గొన్నారు. -
పై కోర్టుకి అప్పీల్ చెయ్యండి!
ఓర్పుకి, సహనానికి పరీక్షలా సాగుతోంది. లేని వాళ్లకి బీపీ అంటు కుంటోంది. ఉన్నవాళ్లకి పుంజుకుంటోంది. ఓటర్ల అభిప్రాయాలు బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమై ఉన్నాయ్. ఫలితాలు నిద్రావస్థలో ఉన్నాయ్. ఇంకో మూడు వారాలు ఓపిక పట్టాలి. అంతా సవ్యంగా నడిస్తే అప్పటికి ఒడ్డున పడతారు అందరూ. అభ్యర్థులకి ఇదొక మంచి సమయం. ఎవరికి వారు గెలుపు ధీమాతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. రేప్పొద్దున ఫలితాలు ఉల్టాసీదా అయినా ఎవరూ ఏమీ ప్రశ్నించరు. ప్రజాస్వామ్యంలో ఈ ఓట్ల తతంగం చిత్రమైంది. నా చిన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు, ఊరి ఓటర్లందర్నీ పెద్ద దొడ్డికి తోలేవారు. అభ్యర్థి పేరు చెప్పి, ఇష్టమైన వారిని చేతులు ఎత్తమనేవారు. వచ్చిన అధికారి చేతుల్ని లెక్కించేవాడు. ఈ పద్ధతివల్ల కొన్నాళ్లపాటు ఊళ్లో కక్షలు, కార్పణ్యాలు నడిచేవి. సీజన్‌ని బట్టి పంట కుప్పలు తగలబడేవి. జనానికి తిన్నన్ని వరిపేలాలు. పూరిళ్లు, గడ్డి వాములు పరశురామ ప్రీతికి గురి అవుతుండేవి. తర్వాతి కాలంలో పంచాయతీలకి కూడా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి వచ్చింది. అయినా, అదేం చిత్ర మోగానీ ఓడిపోయిన అభ్యర్థి తనకి ఎవరెవరు ద్రోహం చేశారో ఫలితాలు రాగానే ఎలుగెత్తి అరిచేవాడు. ఊరికే పేరుకే సీక్రెట్గానీ అంతా ఓపెనే! చంద్రబాబు ఏపీలో పోలింగ్ కాగానే, ఏ మాత్రం విశ్రమించకుండా అదే గుక్కలో మోదీపై తిట్ల వర్షం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈవీఎంలను నూరు శాతం శంకిస్తున్నారు. ఈసీని మోదీ తొత్తుల్ని చేసి, బ్లాక్ లిస్ట్‌లో పడేశారు. టెక్నాలజీ మీద పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. ఈ కౌంటింగ్ విరామం చంద్రబాబుపై బాగా ప్రభావం చూపిస్తోంది. జగన్ లాంటి నేతల్ని ప్రజలు ఎన్నుకోరని చెబుతూనే బాబు పూర్తిగా డీలా పడుతున్నారు. ప్రజల మీద అంత నమ్మకం ఉంటే, జగన్ మీ స్థాయి నీతి మంతుడు కాడని విశ్వాసం ఉంటే నిశ్చింతగా నిద్రపోండి. ఈ కలవరపాట్లు, కలవరింతలు దేనికి చంద్రబాబూ? ఇక్కడొక పిట్ట కథ చెప్పాలి. కోర్టులో ఖరీదైన వ్యాజ్యం నడుస్తోంది. నడిచి నడిచి చివరకు తీర్పు వచ్చింది. తన క్లయింటు దారుణంగా ఓడి పోయాడు. ఆ లాయర్‌కి ఈ సమాచారం ఎట్లా చెప్పాలో తెలియక, ‘అయ్యా, న్యాయం గెలిచింది’ అంటూ క్లుప్తసరిగా టెలిగ్రామ్ కొట్టాడు. ‘పై కోర్టుకి అప్పీల్ చెయ్యండి’ అంటూ ఆ క్లయింట్ జవాబు కొట్టాడు. నిజానికి ఈ తీరికలో చంద్రబాబు కేంద్ర రాజకీయాలమీద దృష్టి సారించవచ్చు. తిప్పబోయే చక్రానికి పదును పెట్టుకోవచ్చు. రాష్ట్రంలో పునాదుల్లోనే ఉండిపోయి మట్టి తింటున్న అనేక నిర్మాణాలని పరామర్శించవచ్చు. ఒకసారి సింగపూర్ వెళ్లి అందర్నీ పలకరించి రావచ్చు. పోలింగ్ తర్వాత సాయంత్రంవేళ వచ్చి ముమ్మరంగా ఓట్లు వేసిన మహిళల మీద చంద్ర బాబు నమ్మకం పెట్టుకున్నారని వినికిడి. అంటే అప్పటిదాకా ఓటింగ్‌లో పాల్గొన్న వారిమీద నమ్మకం లేదనేగా? పసుపు కుంకుమ పేరుతో ఆడపడుచులకు ప్రభుత్వ ఖజానాలోంచి పంచిన డబ్బు వారిని ఓటింగ్ బూత్‌లకు పరుగులు తీయించిందని బాబు నమ్మకం. ఇలాంటి ఊహాగానాలను బాబు డెబ్భై రెండు మేళ కర్త రాగాలలో ఆలాపిస్తూ ఆనందిస్తున్నారట. అన్ని రాగాలూ వారికి వచ్చా అని చెప్పిన సన్నిహితుణ్ణి అడిగాను. వారికి ఈ విశాల విశ్వంలో రానిదేముంది? వారు పాడింది పాట, ఆలాపిం చింది రాగం అన్నాడు. ఇంతకీ ఆలస్యంగా పడిన మహిళల ఓట్లు ఖజానా సొమ్ముతో పడినవి కావని అనుభవజ్ఞులు అంటున్నారు. ఎప్పుడూ ఇంతే, చాలామంది నేతలు, ప్రజలు తమను అనుసరిస్తున్నారో, వెంబ డిస్తున్నారో విడమరిచి అర్థం చేసుకోలేరు. పండో పచ్చో ఫలితం నవ్వుతూ పెట్టెల్లో కులుకుతోంది. ధర్మం నెగ్గుతుంది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఓటుపై కత్తుల వేట!
జిల్లాలో టీడీపీ నేతలు సహనం కోల్పోయారు. ఓటమి భయంతో హింసాత్మక చర్యలకు ఒడిగట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదారు. తంబళ్లపల్లెలో ఓ కార్యకర్తను రాళ్లతో కొట్టి, కాళ్లతో తొక్కి చంపేశారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియానూ వదల్లేదు. కెమెరాలు లాక్కుని, ఐడీ కార్డులు చింపేసి అరాచకం సృష్టించారు. కొందరు నేతలు క్యూల్లోకి వెళ్లి యథేచ్ఛగా ప్రచారాలు చేస్తున్నా పోలీసులు అడ్డుచెప్పకపోవడం గమనార్హం. సాక్షి, తిరుపతి/చిత్తూరు అర్బన్: జిల్లాలోని ఓటర్లలో చైతన్యం కట్టలు తెంచుకుంది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం కనిపించింది. పోలింగ్ ప్రారంభ సమయానికే కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఓటర్లు బారులు తీరారు. అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీఎం పరిధిలో ఆ పార్టీ నేతలు దాడులకు పూనుకున్నా రు. నియోజకవర్గంలోని అన్ని బూత్‌లలో వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఓట్లు వేస్తుండడంతో ఒకింత అసహనానికి లోనయ్యారు. టిసదుం జెడ్పీ హైస్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్‌లో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఓటర్లు కొందర్ని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారికి అడ్డుతగిలారు. రెచ్చిపోయిన టీడీపీ నేతలు రామాపు రం గ్రామానికి చెందిన ఆర్సీ వెంట్రామిరెడ్డి (68), మరికొందరు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వెంకట్రామిరెడ్డిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎంఎస్ బాబుపై హత్యాయత్నం పూతలపట్టు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంఎస్.బాబును హత్య చేయడానికి టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. సీఎం సామాజికవర్గానికి చెందిన పలు గ్రామాల్లో దళితులను ఓట్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. తొలుత బందార్లపల్లెలో దళితులను ఓటు వేయడానికి అగ్రవర్ణాలు అంగీకరించలేదు. దీన్ని ప్రశ్నించడానికి వెళ్లిన ఎంఎస్ బాబుపై అక్కడే దాడిచేసి మట్టుబెట్టాలని టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. కానీ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పచ్చ ముసుగు ధరిం చిన అల్లరిమూలు పారిపోయాయి. అటునుంచి ఐరాల మండలంలోని కట్టకిందపల్లెకి వెళ్లిన బాబు దళితులను ఎందుకు ఓటు వేయనివ్వడం లేదని ప్రశ్నించారు. అప్పటికే కాపుకాచిన టీడీపీ నేతలు బాబుతో పాటు ఆయన గన్‌మన్, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయాలతో తప్పించుకుని వెళుతున్న బాబు వాహనాన్ని అడ్డగించి, ధ్వంసం చేశారు. ఆయన్ను కిడ్నాప్‌చేసి మామిడితోపులోకి తీసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో హత్య చేయడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన అనుచరులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. తెల్లగుండ్లపల్లెలో వైఎస్సార్సీపీ ఏజెంటుగా ఉన్న బాబ్జి అనే యువకుడ్ని టీడీపీ నేతలు కొట్టుకుంటూ లాక్కొచ్చారు. దాదాపు 300 మందిని ఓట్లు వేయనివ్వకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెడ్డెప్పపై దాడికి యత్నం కుప్పం మండలంలోని కృష్ణదాసనపల్లెలో పోలింగ్ సరళి పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పపై టీడీపీ నాయకులు దాడి చేయడానికి ప్రయత్నిం చారు. చిత్తూరు రూరల్ మండలంలోని చెర్లోపల్లెలో స్థానికేతరులు ఓట్లు వేయడానికి వస్తుంటే అడిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వాళ్లు రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. కుప్పంలో కుట్రలు కుప్పం నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతల కుట్రలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దళవాయికొత్తపల్లి, కృష్ణదాసనపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఇదిలావుంటే కుప్పం పరిధిలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఎక్కడా తన ఏజెంట్లను నియమించకుండా చంద్రబాబుకు ఓట్లు వేసేలా కృషి చేశారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీపురం రాగిగుంట బూత్‌లో ఉన్న వైస్సార్సీపీ ఏజెంట్లను బయటకు వెళ్లాలంటూ టీడీపీ నేతలు, అధికారులు బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లో ఉండకూడదట తిరుపతి ఎన్జీఓ కాలనీలోని బూత్ నంబర్ 40లో టీడీపీ ఏజెంట్లను లోపల కూర్చో బెట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకున్నారు. అదేమిటని అడిగితే లోపల స్థలం చాల్లేదని చెప్పుకొచ్చారు. తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. రేణిగుంట మండలం ఎస్ఎన్ పురం బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలో ఫొటోలు లేవు. గుడిమల్లంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేయడం కనిపించింది. వైస్సార్సీపీకి ఓట్లు పడుతున్నాయని ఓ కార్యకర్త చేత ఈవీఎంని గట్టిగా ఒత్తి మిషన్ పనిచెయ్యకుండా చేశారు. పోలింగ్ ప్రారంభమయ్యేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు రేణిగుంట మండలం గాజులమండ్యం, నల్లపాళెం గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గాజులమండ్యం పారిశ్రామికవాడ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా రెండు గ్రామాలతో పాటు మరికొన్ని పల్లెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిపై ఎవ్వరూ స్పందించకపోవడంతో వారు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. తర్వాత సమస్య సర్దుమణిగింది. చంద్రగిరిలో తమ్ముళ్లు దాష్టీకం వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారన్న నెపంతో రామచంద్రాపురం మండలానికి చెందిన దళితులను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారు. రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీకండ్రిగ, ఎన్ఆర్ కమ్మపల్లి, గణేశ్వరపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ దాడికి తెగబడ్డారు. టీడీపీ ఏజెంట్లు మినహా మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం. కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి విలేకరులు ప్రకాష్, శివశంకర్, రాజారెడ్డి, మరో ఫొటోగ్రాఫర్‌ను అడ్డుకున్నారు. సాక్షి విలేకరి శివశంకర్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇతని వద్ద, రాజారెడ్డి వద్ద ఉన్న సెల్ఫోన్లు, ఐడీ కార్డులను లాక్కుని తరిమారు. సొరకాయలపాళెం గ్రామానికి చెందిన ఇరువర్గాల వారు రాళ్లు, రప్పలు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మండల పరిధిలోని అనేక గ్రామాల్లో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పాకాల మండలంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భాస్కరనాయుడుపై చేయిచేసుకున్నారు. తమ్ములగుంటలో పులివర్తి నాని భార్య హల్చల్ చేశారు. మొరాయించిన ఈవీఎంలు జల్లా వ్యాప్తంగా సుమా రు 2,350 ఈవీఎంలు మొరాయించినట్లు అధికారులు వెళ్లడించా రు. వీటిని సకాలంలో సరిచేయడంతో సమస్య తప్పినట్లయింది. -
ఫేక్ ట్వీట్‌పై చంద్రబాబుకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని సర్వేలన్నీ ఘోషిస్తుండడం, క్షేత్ర స్థాయిలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన దిగజారుడు రాజకీయాలకు మరోసారి పదును పెంచి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే ఫేక్ ఆడియోలు, ఫేక్ గొడవలు, ఫేక్ ధర్నాలు, ఫేక్ సర్వేల పేరుతో అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేపించిన చంద్రబాబు, చివరి అస్త్రంగా పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఫేక్ ట్వీట్లను సృష్టించి ఓట్లు రాబట్టాలనుకున్నారు. ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్‌ను సృష్టించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. అయితే ఈ తప్పుడు వార్తలపై ప్రశాంత్ కిషోర్ తన అధికారిక ట్విట్టర్లో స్పందించారు. 'ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు, వారి విజ్ఞతమీద నమ్మకం లేనప్పుడు, ఇలా దిగజారిపోయి నిందలు వేస్తారు. అసత్యాలు, నకిలీ వార్తలు ప్రచారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పును నిర్ణయించుకున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ ముగియనుంది. బై బై బాబు అని చెప్పడానికి ఇదే సరైన సమయం' అంటూ ఫేక్ ట్వీట్ ఫోటోతో పోస్ట్ పెట్టి చంద్రబాబును ట్యాగ్ చేశారు. .@ncbn when you lose trust of the people and your faith in their wisdom, after abuses and lies, you stoop down to circulating fake news. Few hours left for the polling to close but it’s clear that people of AP have decided their verdict. It is time to say #ByeByeBabu pic.twitter.com/TH3K4dwXqB — Prashant Kishor (@PrashantKishor) April 11, 2019 -
హింసకు టీడీపీ కుట్ర.. ఈసీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ హింసను ప్రేరేపించే విధంగా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈమేరకు చంద్రబాబు నాయుడుపై ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. కడప జిల్లాకు చెందిన కొంతమంది పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌లో గెడవలు సృష్టించే విధంగా టీడీపీ నాయకులు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికలకు ఒక్కరోజు ముందు చంద్రబాబు నాయుడు ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లి వారిని బెదిరించే విధంగా మాట్లాడారని.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లర్లు సృష్టించి ఆ నెపాన్ని వైఎస్సార్సీపీపై నెడుతున్నారని, టీడీపీ నేతల దౌర్జన్యాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి ఈసీని కోరారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వర్గీయుల దాష్టీకానికి వైఎస్సార్సీపీ కార్యకర్త పుల్లారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. వారి ఆకృత్యాలను ప్రశ్నించిన వారిపై వేటకొడవళ్లతో దాడికి పాల్పడుతూ.. అరాచకం సృష్టిస్తున్నారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.