
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ హింసను ప్రేరేపించే విధంగా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈమేరకు చంద్రబాబు నాయుడుపై ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. కడప జిల్లాకు చెందిన కొంతమంది పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌లో గెడవలు సృష్టించే విధంగా టీడీపీ నాయకులు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికలకు ఒక్కరోజు ముందు చంద్రబాబు నాయుడు ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లి వారిని బెదిరించే విధంగా మాట్లాడారని.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అల్లర్లు సృష్టించి ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెడుతున్నారని, టీడీపీ నేతల దౌర్జన్యాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి ఈసీని కోరారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వర్గీయుల దాష్టీకానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్త పుల్లారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. వారి ఆకృత్యాలను ప్రశ్నించిన వారిపై వేటకొడవళ్లతో దాడికి పాల్పడుతూ.. అరాచకం సృష్టిస్తున్నారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment