
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ గెలిచే సీనుంటే చంద్రబాబు నాయుడు నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్ ఏజెంట్లకైనా ధైర్యం నూరిపోయడంని సూచించారు. ఎన్నికలు ఐదేళ్లకొకసారి మాత్రమే వస్తాయని, కానీ పార్టీలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు. మే నెలలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి తమని ఇబ్బంది పెట్టాలని చూశారని, ఇలాంటి శోకాలెందుకని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాగా ఎన్నికల్లో గెలుపు టీడీపీదే అని తాను చేయించిన నాలుగు సర్వే ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయని చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విజయసాయి రెడ్డి మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment