సాక్షి, అమరావతి: పోలింగ్ అనంతరం దాడులు జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లాయని సిట్ సారథి వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. క్లూస్ టీమ్స్‌తో కలిసి సిట్ అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తామని తెలిపారు. వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్‌కు రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నామని, రెండ్రోజుల్లో సిట్ కీలక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
డీజీపీ హరీష్ గుప్తాతో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ భేటీ అయ్యారు .సుమారు 30 నిమిషాలపాటు వీరిరువురి మధ్య సమావేశం జరిగింది. హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్లు డీజీపీకి వినీత్ తెలిపారు. ఇప్పటి వరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఎఫ్‌ఐఆర్‌లను సిట్ పరిశీలించనుంది. ఎఫైఆర్‌లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా?..లేదా సెక్షన్లు మార్చాల అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు కేసులు కట్టకపోతే..సిట్ కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించనుంది. కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై ఆరా తీస్తుంది. ఎప్పటికప్పుడు సిట్ పనితీరు డీజీపీకి అందించేలా పరివేక్షణ జరుగుతోంది.
మరోవైపు ఎన్నికల హింసపై సిట్ ముమ్మర దర్యాప్తు జరుపుతోంది. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఏర్పడిన్ సిట్.. నిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారంభించింది.3 జిల్లాలకు మూడు బృందాలను నియమించారు వినీథ్ బ్రిజ్‌లాల్. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో సిట్ విచారణ జరుపుతోంది. తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావు పేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ఫోకస్ చేస్తోంది.హింసకు కారణమైన పోలీస్ అధికారుల ఊపాత్రమైనా విచారణ జరుపుతోంది. హింస ఘటనలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను క్షణ్ణంగా పరిస్తోంది.
ఇదిలా ఉండగా సస్పెండెడ్ ఎస్పీ బిందు మాధవ్‌ను విచారిస్తోంది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను బిందుమాధవ్ కలిశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల అల్లర్లు, హింసాత్మక ఘటనలపై విచారణ జరుపుతున్నారు. గురజాల, మాచర్ల, నరసరావు పేట, సత్తెనపల్లిలో హింసపై విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment