స్వర్ణభారతి స్టేడియంలో మాక్ కౌంటింగ్‌లో పాల్గొన్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఇవ్వడానికి వీల్లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. ఒక్కోసారి చిన్నపొరపాటే కొంపముంచుతుందని, అందుకు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు. గురువారం స్థానిక స్వర్ణభారతి ఆడిటోరియంలో ఆర్వోలు, ఏఆర్వోలు, సూపర్‌వైజర్లకు ఓట్ల లెక్కింపుపై శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా మాక్ కౌంటింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రతి ఒక్క అంశాన్ని వివరించారు. సువిధ యాప్ నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు. డేటాను మొదట ఎంట్రీచేసిన తర్వాతనే రౌండ్‌ల వారీగా ఫలితాలను ప్రకటించాలన్నారు. శిక్షణలో జేసీ – 2 ఎం.వెంకటేశ్వరరావు, విశాఖ, అనకాపల్లి ఆర్డీవోలు తేజ్‌భరత్, సూర్యకళ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment