రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్‌ | AP Assembly Elections Notification Will Be Issued On Apr 18 | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్‌

Published Wed, Apr 17 2024 4:03 PM | Last Updated on Thu, Apr 18 2024 3:04 PM

AP Assembly Elections Notification Will Be Issued On Apr 18 - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో  గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది.  ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (ఏప్రిల్‌ 18) నోటిషికేషన్‌  విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. 

అదే విధంగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది.  ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

సర్వేలు బంద్‌

రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్‌ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీపోల్‌ సర్వే కానీ, ఒపినియన్‌ పోల్‌ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్‌ 1న మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది.

ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

  • ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ
  • ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
  • ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
  • ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
  • ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు
  • ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు
  • తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు
  • తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం
  • సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక
  • జూన్ 4న ఓట్ల లెక్కింపు

ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement