నదుల కలయిక కలే | state division affects on rivers | Sakshi
Sakshi News home page

నదుల కలయిక కలే

Published Mon, Jan 20 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

ఇన్నాళ్లూ ఒక స్వప్నంలాగే ఉండిపోరుున నదుల అనుసంధానం ఇక దక్షిణ భారతాన అసలు సాధ్యమే కాని పరిస్థితులు ఏర్పడతాయూ!?

     విభజిస్తే గోదావరి నీరు కృష్ణా బేసిన్‌కు తరలింపు కష్టమే!
     ఇక దుమ్ముగూడెం ప్రాజెక్టును కూడా వురచిపోవాల్సిందే
     ఇప్పటికే పక్కన పెట్టారు.. విభజిస్తే పూర్తిగా రద్దయ్యే ప్రమాదం
     పోలవరానికి ఇప్పటికే కష్టాలు.. వుుంపు ప్రాంతం తెలంగాణలో...
     పోలవరం నుంచి కృష్ణాకు 80 టీఎంసీల తరలింపూ సులువు కాదు


 ఇన్నాళ్లూ ఒక స్వప్నంలాగే ఉండిపోరుున నదుల అనుసంధానం ఇక దక్షిణ భారతాన అసలు సాధ్యమే కాని పరిస్థితులు ఏర్పడతాయూ!? గోదావరి నుంచి కృష్ణా తదితర దిగువ బేసిన్ల అవసరాలకు జలాల తరలింపు ఇక ప్రణాళికలకే పరిమితం కానుందా!? దువుు్మగూడెం వురచిపోవల్సిందేనా!? పోలవరం ఓ సుదీర్ఘ స్వప్నం కానుందా!? ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, వుహారాష్ట్రలతో ఇప్పటికే జలవివాదాలు తీరని నష్టాలు తీసుకొస్తున్న నేపథ్యంలో... రాష్ట్ర విభజన తరువాత వురిన్ని తగాదాలు, నీటికష్టాలూ తప్పవనేది తాజాగా ఇంజనీర్ల మనోగతం!!

 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నదులను అనుసంధానించడం వల్ల సవుుద్రంలో వృథాగా కలిసే ప్రవూదాన్ని తగ్గిస్తూనే, వరదలు- కరువు కష్టాలకు తెరవేయూలనేది ఎంతోకాలంగా ఉన్న ఆలోచన. నీరు పుష్కలంగా ఉన్న గోదావరి నుంచి నీటికొరత పీడిస్తున్న కృష్ణాకు అనుసంధానించడం కూడా అందులో ఒకటి. రాష్ట్రంలో దువుు్మగూడెం, పోలవరం ఆ దిశలో ఉపయుుక్త ప్రాజెక్టులు. ఏ కోణం నుంచి చూసినా రాష్ట్రాన్ని విభజిస్తే ఆ రెండూ కలలుగానే మిగిలిపోతాయునేది ప్రస్తుతం అందరినీ కలవరపరుస్తున్న అంశం!
 దువుు్మగూడెం- నాగార్జునసాగర్ టెరుుల్‌పాండ్ ప్రాజెక్టు నిర్మాణానికి 2007-08లోనే టెండర్లు ఖరారు అయ్యూరుు. రూ.20 వేల కోట్ల అంచనా వ్యయుంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా వరదలు వచ్చిన 80 రోజుల్లో దువుు్మగూడెం నుంచి 165 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించి నాగార్జునసాగర్ టెరుుల్ పాండ్‌లోకి తీసుకురావాల్సి ఉంది.

ఈ నీటిని కృష్ణా ఆయుకట్టుకు వాడుకోవాలని భావించారు. తద్వారా కృష్ణా ఎగువన మిగిలే నీటితో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎవ్మూర్పీలతో పాటు రాయులసీవు, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాలకు ప్రయోజనం కలిగే గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ లాంటి ప్రాజెక్టుల అవసరాలు తీరే వీలు ఏర్పడేది. కృష్ణా బేసిన్‌లో సరైన వర్షాలు కురియుక నీటి కొరత ఏర్పడితే సాగర్ ఆయుకట్టుతో పాటు, డెల్టా రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పటికే రూ. 547 కోట్లను ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు పనులు 2014-15కి పూర్తి కావాలి. టెండర్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికలు రావడం, తర్వాత వైఎస్ వుృతి చెందడంతో దీనికి కష్టాలు మొదలయ్యూరుు. రోశయ్యు సీఎంగా ఉన్నప్పుడు కొందరు తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయూలని డివూండ్ చేశారు. దాంతో అప్పటి నుంచి పనుల్ని చేయుడం లేదు. విభజన అనంతరం దీన్ని పూర్తిగా రద్దు చేయుడంగానీ లేదంటే కేవలం తెలంగాణకు ఉపయుుక్తవుయ్యేలా డిజైన్లు వూర్చి చేపట్టే అవకాశాలే ఉంటారుు. ప్రస్తుత అంచనాలను బట్టి దీనికి రూ.30 వేల కోట్లు కావాలి. అంత ఖర్చు భరించి తెలంగాణ ప్రభుత్వం కోస్తాకు నీటిని ఇవ్వడవునేది ఊహకందని విషయుం. ఒకవేళ చేపట్టినా తెలంగాణ ప్రాంత అవసరాలకు వూర్చుకుంటావుని తెలంగాణవాదులు బహిరంగంగానే చెబుతున్నారు.

 50 ఏళ్లలో కేంద్రం నిర్మించిన ప్రాజెక్టే లేదు: పోలవరం ప్రాజెక్టును కేంద్ర పరిధిలోనే చేపడుతామని టీ బిల్లులో పేర్కొన్నారు. అయితే సాగునీరు అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. పైగా గత 50 సంవత్సరాలుగా దేశంలో ఒక్క ప్రాజెక్టును కూడా కేంద్రం నిర్మించలేదని నిపుణులు చెబుతున్నారు. 1952లో ఒరిస్సాలోని మహానదిపై హీరాకుడ్ డ్యాం నిర్మాణం తప్ప, ఆ తర్వాత కేంద్ర జల సంఘం ఎలాంటి ప్రాజెక్టును చేపట్టలేదు. పైగా ఈ ప్రాజెక్టు వుుంపు బాధితులు ఆదివాసులు, తెలంగాణ ప్రాంతం వారు. దాంతో వారు కోల్పోయే భూములకు సమాన భూములను ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో కేటాయించాల్సి ఉంది. అయితే... పోలవరం ఆయకట్టు ప్రాంతంలోని 80 వేల నుంచి లక్ష ఎకరాల ఆయకట్టును.. తెలంగాణ ప్రాంత ముంపు బాధితులకు పంచడానికి ఎన్ని ఇబ్బందులో ఊహించుకోవాల్సిందే. అందుకే పోలవరం డిజైన్లు వూర్చాలనే డివూండ్‌ను తెలంగాణవాదులు వదులుకునే అవకాశాలూ లేవు. ఒకవేళ నిర్మించినా పోలవరం కుడికాలువ నుంచి అవసరమైతే కృష్ణా డెల్టా అవసరాలకు 80 టీఎంసీలను త రలించవచ్చు గానీ అంతకు మించి ఇతర బేసిన్లకు తరలించడం సాధ్యం కాదు!

 పాలమూరుకు ఇక్కట్లు: ఈ ప్రాజెక్టుల నుంచి కృష్ణాకు నీటి తరలింపు నిలిచిపోతే... పాలవుూరుపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. కల్వకుర్తి (25 టీఎంసీలు), నెట్టెంపాడు (22 టీఎంసీలు) ప్రాజెక్టులు వరద జలాలపై ఆధారపడ్డారుు. కృష్ణాలో భారీగా వరదలు వచ్చిన సవుయుంలోనే ఈ ప్రాజెక్టులకు నీరు అందనుంది. ఎప్పుడో కానీ ఇలాంటి పరిస్థితి రాదు. అరుుతే దువుు్మగూడెం, పోలవరం నీరు కృష్ణా బేసిన్‌కు వస్తే ఈ ప్రాజెక్టులకు నీటి వాడకానికి వెసులుబాటు కలగనుంది. ఇదే జిల్లాలో రాజీవ్ బీవూ (20 టీఎంసీలు) ప్రాజెక్టుకు కూడా కష్టాలే. కృష్ణా డెల్టా ఆధునీకరణ ద్వారా ఆదా అయ్యే నీటిని ఈ ప్రాజెక్టుకు కేటారుుంచారు. అరుుతే ప్రస్తుతం ఆధునీకరణ పనులు పూర్తి కాలేదు. దాంతో నీటి ఆదా లేదు. వురో పక్క బీవూ ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంది. దీని నీటిని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తే కృష్ణా డెల్టాకు నీటి కొరత ఏర్పడనుంది. దాంతో రెండు ప్రాంతాల వుధ్య నీటి వివాదానికి తెరలేవనుంది.

 రెండు ప్రభుత్వాల ఏకాభిప్రాయంతోనే సాధ్యం

 రాష్ట్రం విడిపోతే.. రెండు ప్రభుత్వాలు పరస్పరం ఏకాభిప్రాయానికి వస్తేనే నదుల అనుసంధానం సాధ్యం.  పోలవరంపై ఇప్పటికే ముంపు సమస్య ఉంది. విభజనతో అభ్యంతరాల జాబితాలో మరో రాష్ర్టం చేరనుంది. అలాగే దుమ్ముగూడెం-సాగర్ టెయిల్ పాండ్ సాధ్యం కావాలంటే... తెలంగాణ రాష్ర్టమే చేపట్టాల్సి ఉంటుంది.     - టి. హన్మంతరావు, సాగునీటి రంగ నిపుణుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement