
సాక్షి, హైదరాబాద్: గౌతమ్‌రెడ్డికి హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. జూబ్లీహిల్స్‌లో సినీనటులు నాగార్జున, అల్లరి నరేశ్ తదితరుల ఇళ్లపక్కనే మేకపాటి కుటుంబం నివసిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడలో ఉన్న బద్రుకా కాలేజీలో గౌతమ్‌రెడ్డి డిగ్రీ పూర్తిచేశారు. టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులతో ఆయనకు స్నేహం ఉంది. ముఖ్యంగా దగ్గుబాటి కుటుంబం, హీరో వెంకటేశ్, నాగార్జున, పవన్‌కల్యాణ్ తదితరులతో రాజకీయాలకు అతీతంగా మంచి మిత్రృత్వం ఉన్నట్టు చెప్తుంటారు.
హైదరాబాద్ నగరంలో అసదుద్దీన్ ఒవైసీ సహా చాలా మంది నేతలు, ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేకపాటి గౌతమ్‌రెడ్డి తన 50వ పుట్టినరోజును రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో డెస్టినేషన్ పార్టీ ఏర్పాటు చేసి సన్నిహితులను ఆహ్వానించారు. తన 50వ పుట్టినరోజుకు తగ్గట్టుగా.. 50 జంటలను ఆ పార్టీకి పిలవడం గమనార్హం.
చదవండి: (మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం.. మహబూబాబాద్ జిల్లాలో విషాదఛాయలు)
Comments
Please login to add a commentAdd a comment