
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment