
స్వర్ణ కంకణాన్ని తొడుగుతున్న సీఎం జగన్
సాక్షి, సోమశిల (నెల్లూరు): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కాంస్య విగ్రహాల రూపకల్పన చేసిన స్థపతి వడయార్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వర్ణ కంకణం బహూకరించారు. సంగంలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో విగ్రహాలు తయారు చేసిన స్థపతి వడయార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా స్థపతి చేతికి స్వర్ణ కంకణాన్ని తొడిగి అభినందించారు.