వచ్చే ఏడాదిలో మరిన్ని పెట్టుబడులు
సంస్థ చైర్మన్ యాంగ్‌లీ ప్రకటన
శ్రీపెరంబదూర్: భారత్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్‌లీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంపై దృష్టితో బ్యాటరీ తయారీ వ్యాపార విస్తరణపై ఫాక్స్‌కాన్ దృష్టి సారించింది. ఈ సంస్థ ఈ–బస్‌ల కోసం తైవాన్‌లో ఇలాంటి ప్లాంట్ ఒకదాన్ని ఇప్పటికే ఏర్పాటు చేయగా, ఈ ఏడాదే ఉత్పత్తి మొదలు కానుంది.
‘‘3ప్లస్3 భవిష్యత్ పరిశ్రమ ఏర్పాటుకు వేచి చూస్తున్నాం. తమిళనాడులో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్) ఏర్పాటు విషయంలో సహకారం ఎలా అన్నదానిపై పరిశ్రమల మంత్రితో చర్చిస్తున్నా’’ అని యాంగ్‌లీ తెలిపారు. సోలార్, విండ్ టర్బయిన్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నిల్వ చేసేందుకు బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు వీలు కలి్పస్తాయి.
మన దేశం పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దీంతో ఈ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఫాక్స్‌కాన్ ఆసక్తిగా ఉన్నట్టు యాంగ్‌లీ మాటలను బట్టి తెలుస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా ఫాక్స్‌కాన్ ప్రణాళికలు అమలు చేస్తోంది. త్వరలోనే ఈవీల తయారీ మొదలవుతుందని యాంగ్‌లీ తెలిపారు.
భారత్‌లో ఇప్పటివరకు తాము 1.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, వ్యాపారం 10 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్లు చెప్పారు. రానున్న ఏడాది కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ప్రస్తుత భారత పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాల సీఎంలతో యాంగ్‌లీ సమావేశం కావడం గమనార్హం. ఎన్నో రాష్ట్రాలను సందర్శించిన తర్వాత భారత్ వృద్ధి పథకంలో ఉందని అర్థమవుతోందంటూ.. ఈ ప్రయాణంలో ఫాక్స్‌కాన్ సైతం భాగస్వామి కావాలనుకుంటున్నట్టు యాంగ్‌లీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment