హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తైవాన్‌కు చెందిన చిప్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ భావిస్తోంది. అయితే ఫాక్స్‌కాన్ ఇతర ఈవీ కంపెనీల కోసం కాంట్రాక్ట్ తయారీ చేపడుతుందా లేదా సొంత బ్రాండ్ కింద మోడళ్లను విక్రయించబోతోందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తమిళనాడును తమ స్థావరంగా ఉపయోగించుకోవాలని ఫాక్స్‌కాన్ చైర్మన్ చర్చించినట్లు తెలుస్తోంది.ఫాక్స్‌కాన్ మాతృ సంస్థ హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యంగ్ లేయో యూఎస్‌లోని ఓహియోతోపాటు థాయ్‌లాండ్‌లో ఈవీ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అలాగే అతి త్వరలో భారత్‌లో కూడా ఈవీ ఫ్యాక్టరీని నిర్మిస్తాం అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment