
5 ఏళ్లు..5 బిలియన్ డాలర్లు..
పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించిన ఫాక్స్‌కాన్
మహారాష్ట్రలో తయారీ యూనిట్, ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు
ముంబై: తైవాన్‌కు చెందిన ప్రపంచ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. మహారాష్ట్రలో వచ్చే ఐదేళ్లలో రూ. 32 వేల కోట్ల(5 బిలియన్ డాలర్లు)ను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఫాక్స్‌కాన్ శనివారం తెలిపింది. ఇందులోభాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం, ఫాక్స్‌కాన్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. కంపెనీ ఈ పెట్టుబడులను తయారీ యూనిట్ స్థాపనకు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్ర ఏర్పాటుకు వెచ్చించనుంది.
వీటి ఏర్పాటు ముంబై లేక పుణే ప్రాంతంలోని 1,500 ఎకరాల్లో ఉంటుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మహారాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండటం తమను ఆకర్షించిందని ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గో తెలిపారు. స్నాప్‌డీల్, మైక్రోమ్యాక్స్, అదాని గ్రూప్ తదితర కంపెనీలతో జతకడుతున్నట్లు ఫాక్స్‌కాన్ ఇది వర కే ప్రకటించింది. ఫాక్స్‌కాన్ కంపెనీ యాపిల్ ఐ-ఫోన్స్‌ను తయారు చేస్తుంది.