యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రొ: భారీ తగ్గింపు  | Massive Discount On Apple Airpods Pro In Sale, Check Price Details Inside - Sakshi
Sakshi News home page

Discount On Apple AirPods Pro: యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రొ: భారీ తగ్గింపు 

Published Tue, Aug 22 2023 1:18 PM | Last Updated on Tue, Aug 22 2023 5:23 PM

Massiv discount on Apple AirPods Pro check details - Sakshi

టెక్‌దిగ్గజం యాపిల్‌కు  చెందిన ఎయిర్‌పాడ్స్‌ భారీ డిస్కౌంట్‌ ధరలో అందుబాటులో  ఉన్నాయి. యాపిల్‌ పోర్ట్‌ ఫోలియోలో అత్యంత అధునాతన ఇయర్‌ బడ్స్‌ ఎయిర్‌పాడ్‌ ప్రో. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ  పొందిన TWS ఇయర్‌బడ్స్‌గా పాపులర్‌ అయ్యాయి. తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 22,000లకు పైగా తగ్గింపుతో అందుబాటులో  ఉంది. 

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాపిల్‌ ఎయిర్‌పాడ్‌ప్రోరూ.3,910 తగ్గింపు తర్వాత రూ.22,990గా ఉంది. అయితే ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా  పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకునే అవకాశం ఉంది.  నిబంధనల ప్రకారంఈ ఆఫర్‌ వర్తిస్తే  రూ. 21,900 తగ్గింపును కూడా పొందవచ్చు. (షాకిస్తున్న వెండి, బంగారం ధరలు)

ఎయిర్‌పాడ్‌ప్రో ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,MagSafe ఛార్జింగ్ కేస్‌, ట్రాన్సపరెంట్‌ మోడ్‌లో లభ్యం. మొత్తంచార్జింగ్‌ తరువాత 24 గంటల కంటే ఎక్కువ  సమయమే  వినవచ్చు. ఈ ఎయిర్‌ పాడ్స్‌ ప్రో రూ. 26,900 ధరతో లాంచ్‌ అయ్యాయి.  కాగా యాపిల్‌ ఐఫోన్‌  15 సిరీస్‌ సెప్టెంబర్ 12న విడుదల చేయనుంది కంపెనీ. ఈ మెగా ఈవెంట్‌లో ఎయిర్‌పాడ్స్‌ కొత్త సిరీస్‌ను కూడా లాంచ్‌ చేయనుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పాడ్స్‌ తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చాయి.  (ఎక్స్‌ టేకోవర్: ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు,అసలేం జరుగుతోంది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement