కుమారుడు మాట వినడం లేదని రైతు ఆత్మహత్య
Published Thu, Sep 1 2016 12:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
రేగొండ: తన కుమారుడు వ్యవసాయ పనికి రావడం లేదని మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొడవటంచలో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బాషబోయిన పోషాలు(55) కొన్నేళ్ల క్రితం గణపురం నుంచి కొడవటంచలోని అత్తవారింటి వద్దకు వచ్చాడు. నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. నిత్యం తానే వ్యవసాయ పనులు చేస్తూ ఇబ్బందులు పడుతున్నానని, తన కుమారుడు ప్రశాంత్‌ను కూడా వ్యవసాయ పనుల్లో సాయపడాలని కోరాడు. ప్రశాంత్ సహకరించకపోవడంతో అతడిని భయపెట్టాలన్న ఉద్దేశంతో బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో పోషాలు పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకోవడంతో చుట్టుపక్కలవారు గమనించి భార్య స్వరూపకు సమాచారమిచ్చారు. అతడిని చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడిSభార్య స్వరూప, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు.
Advertisement
Advertisement