నేటి రోజుల్లో గూగుల్ మ్యాప్ తెలియనివారు, వినియోగించనివారు ఎవరూ ఉండరు. ఎవరైనా సరే తాము తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్ తప్పకుండా ఫాలో అవుతారు. అయితే గూగుల్ మ్యాప్‌లో రూట్‌లు చెప్పేటప్పుడు సుమధురమైన ఒక మహిళ గొంతు వినిపిస్తుంది. అయితే ఈ గొంతు ఎవరిది? ఆమె పేరు ఏమిటి? ఎక్కడుంటుంది? చాలామందికి ఈ విషయాలు తెలియదు. అందుకే దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ మ్యాప్ వెనుక గొంతు వినిపించే మహిళ పేరు కరెన్ జాకబ్సెన్. పూర్తి పేరు కరెన్ ఎలిజబెత్ జాకబ్సెన్.ఈమె ఆస్ట్రేలియాకు చెందినది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటోంది. ఆమె వృత్తి రీత్యా వాయిస్ ఓవర్ ఆర్టిస్టు. అంతేకాకుండా సింగర్, కంపోజర్, ఇన్ఫ్లుయెన్సర్‌గానూ రాణిస్తోంది. కరెన్‌ను పలు పురస్కారాలు వరించాయి. గూగుల్ మ్యాప్ కారణంగా ఆమె గొంతును ప్రపంచంలోని నలుమూలల జనాభా వింటున్నారు. దీనితో పాటు కరెన్ గొంతు 2011 నుంచి 2014 వరకూ ఆపిల్ ఐఫోన్స్, ఐపాడ్స్, ఐపేడ్స్ తదిర అప్లికేషన్లలో వినియోగించారు.
రెండు పుస్తకాలను కూడా రచించి..
ఆమె ఒక ఫిమేల్ ఎంటర్‌టైనర్ అయిన కారణంగా వన్ ఉమెన్ షోలను ప్రజెంట్ చేస్తుంటుంది. వీటిలో ది ట్రయాడ్, ది లారీ బీచ్‌మన్ థియేటర్ అండ్ పబ్లిక్ థియేటర్, ది డ్యూప్లెక్స్, ది బిట్టర్ ఎండ్ మొదలైనవి ఉన్నాయి. జాకబ్సెన్ రెండు పుస్తకాలను కూడా రచించింది. అవి రీకాలుక్యులేట్- డైరెక్షన్ ఫర్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ సక్సెస్, ది జీపీఎస్ గర్ల్స్ రోడ్ మ్యాప్ ఫర్ ధేర్ ఫ్యూచర్. కరెన్.. డాన్సెన్స్ ఫ్రీక్ కోసం సౌండ్ ట్రాక్ కూడా రూపొందించింది.
ఇది కూడా చదవండి: వీరు విమాన ప్రయాణికులేనా?.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర
Comments
Please login to add a commentAdd a comment