
మన మాటలు కుక్కలకి అర్థమవుతాయట!
లండన్: మనుషులు మాటలను కుక్కలు అర్థం చేసుకుంటాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయంలో ఇటీవల ఒక అధ్యయనంలో తేలినట్లు హంగేరిలోని ఒట్వాస్ లోరాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అటిల్లా అండిక్స్ వెల్లడించారు. కుక్కలను పెంచుకునే యజమానులు తరచూ వాడే పదాలను శునకాలు గుర్తుపెట్టుకుంటాయని, మనిషి మాట్లాడే మాటల ఉచ్ఛారణ, వారి హావాభావాల ఆధారంగా కుక్కలు ఆ పదాల అర్థాలను పసిగడతాయని తమ అధ్యయనంలో స్పష్టమైనట్లు తెలిపారు.