న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్-1 తీవ్ర కలకలం సృష్టిస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. మొత్తం 12 రాష్ట్రాల్లో కలిపి 819 జేఎన్-1 వేరియంట్ కేసులు నమోదైనట్లు మంగళవారం కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇక, జేఎన్-1 కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 250, ఆ తర్వాత కర్ణాటకలో 199, కేరళలో 148 కేసులు వెలుగులోకి వచ్చినట్లు వివరించింది. అదే సమయంలో కొత్తగా 475 కోవిడ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,919కి చేరాయని తెలిపింది. 24 గంటల వ్యవధిలో కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒక కోవిడ్ బాధితుడు చనిపోయినట్లు పేర్కొంది.
A total of 819 cases of JN.1 series variant have been reported from 12 states in India till 8th January 2024: Sources
— ANI (@ANI) January 9, 2024
కర్ణాటక గవర్నర్‌కు కరోనా
ఇదిలా ఉండగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణయింది. ఆయన కోలుకునే వరకు అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు రాజ్‌భవన్ మంగళవారం తెలిపింది. ఆయన రాజ్‌భవన్‌లోనే క్వారంటైన్‌లో ఉన్నారని, చికిత్స అవసరం లేదని వైద్యులు సూచించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment